అంత్యకాలముల యొక్క సూచనలు ఏవి?

ప్రశ్న అంత్యకాలముల యొక్క సూచనలు ఏవి? జవాబు అంత్యకాలములు సమీపిస్తున్నాయి అని మనము ఎరుగులాగున మత్తయి 24:5-8 వచనములు మనకు కొన్ని ప్రాముఖ్యమైన ఆధారాలు ఇస్తున్నాయి, “అనేకులు నా పెరట వచ్చి – నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులు భూకంపములును కలుగును.” అబద్ద…

ప్రశ్న

అంత్యకాలముల యొక్క సూచనలు ఏవి?

జవాబు

అంత్యకాలములు సమీపిస్తున్నాయి అని మనము ఎరుగులాగున మత్తయి 24:5-8 వచనములు మనకు కొన్ని ప్రాముఖ్యమైన ఆధారాలు ఇస్తున్నాయి, “అనేకులు నా పెరట వచ్చి – నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులు భూకంపములును కలుగును.” అబద్ద మెస్సియాలు, యుద్ధములు, కరువులు, తెగుళ్ళు, మరియు ప్రకృతి వైపరీత్యములు అధికమవ్వడం – ఇవన్నియు వేదనలకు ప్రారంభము. ఈ వాక్యభాగములో, మనము ఒక హెచ్చరిక చేయబడ్డాము కూడా: మనము మోసపరచబడకూడదు, ఎందుకంటే ఇవన్నియు కేవలము ప్రసవవేదనలకు ప్రారంభములే, అంతము ఇంకా రావలసియుంది.

ఇశ్రాయేలు దేశములో జరుగుతున్న ప్రతి భూకంపమును, ప్రతి రాజకీయ సంక్షోభమును, మరియు దానిపై జరుగుతున్న ప్రతి దాడిని చూపుతూ కొందరు అంత్య దినములు చాలా వేగంగా వస్తున్నాయని వివరిస్తుంటారు. అంత్యదినముల ఆగమనమును ఈ సంఘటనలు సూచిస్తున్నప్పటికీ, అంత్యదినములు వచ్చినవి అని చెప్పుటకు అవి సూచనలే కావలసిన అవసరం అయితే లేదు. అంత్య దినములలో అబద్ద బోధలు ఊహించని విధంగా ప్రబలమవుతాయని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. “అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు” (1 తిమోతి 4:1, 2). అంత్య దినములు “అపాయకరమైన దినములు”గా అభివర్ణించబడినవి ఎందుకంటే “సత్యమును ఎదురించే” అనేకమంది పురుషులు మరియు ప్రజలు ప్రబలుతారు గనుక (2 తిమోతి 3:1-9; 2 థెస్స. 2:3 కూడా చూడండి).

సాధ్యపడు ఇతర సూచనలు ఏవనగా యెరూషలేములోని యూదుల దేవాలయమును పునఃనిర్మించుట, ఇశ్రాయేలు దేశము పట్ల ద్వేషపూరిత భావము, ఏక-ప్రపంచ ప్రభుత్వము పక్షముగా జరిగే ప్రయత్నాలు. అంత్యకాలముల కొరకు అత్యంత ప్రాముఖ్యమైన సూచన ఏమనగా ఇశ్రాయేలు దేశమే. 1948లో, క్రీ.శ. 70వ సంవత్సరము తరువాత మొట్టమొదటి సారి ఇశ్రాయేలు దేశము సార్వభౌమ దేశముగా ప్రకటించబడింది. తన సంతానమునకు కనాను దేశము “నిత్యస్వాస్థ్యముగా” ఉంటుందని దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసాడు (ఆది. 17:8), మరియు ఇశ్రాయేలు దేశము యొక్క భౌతిక మరియు ఆత్మీయ పునరుజ్జీవాన్ని గూర్చి యెహెజ్కేలు ప్రవచించాడు (యెహెజ్కేలు 37వ అధ్యయములో). అంత్యకాలముల వెలుగులో తన సొంత స్థలములో ఇశ్రాయేలు దేశము ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే కడవరికాలమును గూర్చిన వేదాంతశాస్త్రములో ఇశ్రాయేలునకున్న ప్రాధాన్యతను బట్టి (దానియేలు 10:14; 11:41; ప్రకటన 11:8).

ఈ సూచనలను మనస్సులో ఉంచుకొని, అంత్యకాలములలో సంభవింపబోవునటువంటి సంఘటనల విషయమై మనము కొంచెము జ్ఞానముగా వివేకము కలిగి ఉండగలము. ఈ ఏక సంఘటనలలో ఏ ఒక్క దానిని కూడా చూచి అంత్యకాలములు వేగంగా ముంచుకొస్తున్నాయి అని మనం విశదపరచకూడదు. మనము సిద్ధపడులాగున దేవుడు మనకు చాలినంత సమాచారమును ఇచ్చాడు, కాబట్టి మనము పిలువబడినది ఇలా చేయుటకే.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

అంత్యకాలముల యొక్క సూచనలు ఏవి?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.