ఆత్మహత్యను గూర్చి క్రైస్తవ దృష్టికోణం ఏమిటి? ఆత్మహత్యను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

ప్రశ్న ఆత్మహత్యను గూర్చి క్రైస్తవ దృష్టికోణం ఏమిటి? ఆత్మహత్యను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? జవాబు బైబిల్ ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు వ్యక్తులను గూర్చి చెబుతుంది: అబీమెలెకు (న్యాయాధి. 9:54), సౌలు (1 సమూ. 31:4), సౌలు ఆయుధములు మోయువాడు (1 సమూ. 31:4-6), ఆహీతోపెలు (2 సమూ. 17:23), జిమీ (1 రాజులు 16:18), మరియు యూదా (మత్తయి 27:5). వారిలో ఐదుగురు దుష్ట, పాపపు పురుషులు (ఆయన స్వభావమును గూర్చి తెలుసుకొనుటకు సౌలు యొక్క…

ప్రశ్న

ఆత్మహత్యను గూర్చి క్రైస్తవ దృష్టికోణం ఏమిటి? ఆత్మహత్యను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు

బైబిల్ ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు వ్యక్తులను గూర్చి చెబుతుంది: అబీమెలెకు (న్యాయాధి. 9:54), సౌలు (1 సమూ. 31:4), సౌలు ఆయుధములు మోయువాడు (1 సమూ. 31:4-6), ఆహీతోపెలు (2 సమూ. 17:23), జిమీ (1 రాజులు 16:18), మరియు యూదా (మత్తయి 27:5). వారిలో ఐదుగురు దుష్ట, పాపపు పురుషులు (ఆయన స్వభావమును గూర్చి తెలుసుకొనుటకు సౌలు యొక్క ఆయుధములు మోయువాని గురించి ఎక్కువగా చెప్పబడలేదు). కొందరు సంసోనుది కూడా ఆత్మహత్య అని చెబుతారు (న్యాయాధి. 16:26-31), కాని సంసోను యొక్క గురి తనను తాను చంపుకొనుట కాదుగాని, ఫిలిష్తీయులను చంపుట. బైబిల్ ఆత్మహత్యను కూడా హత్యగా పరిగణిస్తుంది, అది – స్వయం హత్య. ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా మరణించాలని నిర్ణయించేది దేవుడు మాత్రమే.

బైబిల్ ప్రకారం, ఒక వ్యక్తి పరలోకానికి చేరతాడా లేదా అని నిర్థారించేది ఆత్మహత్య కాదు. ఒక రక్షణపొందని వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, అతడు చేసింది కేవలం నరకానికి తన యాత్రను “వేగిరపరచుకొనుట.” అయితే, ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి క్రీస్తులో రక్షణను నిరాకరించినందుకు నరకానికి వెళ్తాడుగాని, ఆత్మహత్య చేసుకున్నందుకు కాదు. ఆత్మహత్య చేసుకొనే క్రైస్తవుని గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? మనం క్రీస్తు నందు విశ్వాసముంచిన మరుక్షణం నుండి మనకు నిత్య జీవము నిర్థారించబడినది అని బైబిల్ చెబుతుంది (యోహాను 3:16). బైబిల్ ప్రకారం, వారి యొద్ద నిత్య జీవము ఉన్నదని క్రైస్తవులు ఎలాంటి సందేహం లేకుండా తెలుసుకోగలరు (1 యోహాను 5:13). ఒక క్రైస్తవుని దేవుని ప్రేమ నుండి ఏది వేరు చేయలేదు (రోమా. 8:38-39). “సృష్టించబడినది” ఏది ఒక క్రైస్తవుని దేవుని ప్రేమ నుండి వేరుచేయలేకపోతే, ఆత్మహత్య చేసుకున్న క్రైస్తవుడు కూడా “సృష్టించబడినవాడే,” కాబట్టి ఆత్మహత్య కూడా వారిని దేవుని ప్రేమ నుండి వేరుచేయలేదు. యేసు మనందరి పాపముల కొరకు మరణించాడు, మరియు ఒక నిజమైన విశ్వాసి, ఆత్మీయ దాడి లేక బలహీనత సమయంలో ఆత్మహత్య చేసుకున్నయెడల, ఆ పాపము కూడా క్రీస్తు రక్తము ద్వారా కప్పబడుతుంది.

అయినను ఆత్మహత్య దేవునికి విరోధంగా ఒక గంభీరమైన పాపం. బైబిల్ ప్రకారం, ఆత్మహత్య హత్యతో సమానం; అది ఎల్లప్పుడూ తప్పే. ఒక క్రైస్తవుడని చెబుతూ ఆత్మహత్య చేసుకొనే వాని యొక్క విశ్వాసంపై అనేక సందేహాలు తలెత్తుతాయి. ఏ పరిస్థితి కూడా ఒకరిని సమర్థించలేదు, ముఖ్యంగా ఒక క్రైస్తవుడు అతని/ఆమె ప్రాణమును తీసుకొనుట. వారి జీవితలను దేవుని కొరకు బ్రతుకుటకు క్రైస్తవులు పిలువబడిరి, మరియు ఎప్పుడు మరణించాలనేది కేవలం దేవుని నిర్ణయం మాత్రమే. ఇది ఆత్మహత్యను వివరించకపోయినప్పటికీ, 1 కొరింథీ. 3:15 ఆత్మహత్య చేసుకున్న క్రైస్తవునికి ఏమి జరగవచ్చునో వివరిస్తుంది: “అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.”

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

ఆత్మహత్యను గూర్చి క్రైస్తవ దృష్టికోణం ఏమిటి? ఆత్మహత్యను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *