ఆత్మీయ పోరాటం గూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నది?

ప్రశ్న ఆత్మీయ పోరాటం గూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నది? జవాబు ఆత్మీయ పోరాటానికి వచ్చేసరికి రెండు ప్రాధమిక తప్పులు ఉండెను- అధిక ఉద్ఘాటన మరియు అల్ప ఉద్ఘాటన. కొందరు ప్రతి పాపము, ప్రతి సoఘర్షణ, మరియు ప్రతి సమస్యను అపవిత్రాత్మ అని నిందించి అది వెళ్లగొట్ట వలసిన అవసరముందని అందురు. ఇతరులు ఆ ఆత్మీయ పరిధిని మరియు ఆత్మీయ శక్తులకు విరోధముగా మన పోరాటం అని బైబిలు మనకు చెప్పుచున్న వాస్తవమును పూర్తిగా నిర్లక్ష్యం చేయుదురు. విజయవంతమైన…

ప్రశ్న

ఆత్మీయ పోరాటం గూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నది?

జవాబు

ఆత్మీయ పోరాటానికి వచ్చేసరికి రెండు ప్రాధమిక తప్పులు ఉండెను- అధిక ఉద్ఘాటన మరియు అల్ప ఉద్ఘాటన. కొందరు ప్రతి పాపము, ప్రతి సoఘర్షణ, మరియు ప్రతి సమస్యను అపవిత్రాత్మ అని నిందించి అది వెళ్లగొట్ట వలసిన అవసరముందని అందురు. ఇతరులు ఆ ఆత్మీయ పరిధిని మరియు ఆత్మీయ శక్తులకు విరోధముగా మన పోరాటం అని బైబిలు మనకు చెప్పుచున్న వాస్తవమును పూర్తిగా నిర్లక్ష్యం చేయుదురు. విజయవంతమైన ఆత్మీయ యుద్ధమునకు తాళం బైబిలు సమతుల్యతను కనుగొనడం. యేసు కొన్నిసార్లు ప్రజలనుండి దయ్యములను వెళ్ళగొట్టి; ఇతర సమయాల్లో ఆయన ప్రజలను అపవిత్రాత్మ గూర్చి ప్రస్తావించకుండానే స్వస్థపరచెను. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను వారిలోనున్న పాపముపై యుద్ధము ప్రకటించమని సూచిస్తూ (రోమా. 6) మరియు అపవాది తంత్రములను ఎదిరించమని వారించుచుoడెను (ఎఫెసీ. 6:10-18).

ఎఫెసీ. 6:10-12 చెప్పును, “తుదకు ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్నదురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” ఈ వాక్యములు కొన్ని క్లిష్టమైన నిజాలను బోధించును; మనము కేవలం ప్రభు యొక్క శక్తిచే బలముగా నిలబడగలము, దేవుని సైన్యము మనలను భద్రపరచును, మరియు మన యుద్ధము చివరిగా లోకములోనున్న కీడు యొక్క ఆత్మీయ శక్తులకు విరోధముగా ఉండును.

ఎఫెసీ. 6:13-18 దేవుడు మనకిచ్చే ఆత్మీయ యుద్దోపకరణముల గూర్చి వివరణ. మనము సత్యమనే దట్టిచే స్థిరముగా నిలబడి, నీతియనే మైమరువు, సమాధాన సువార్తను, విశ్వాసమనే డాలు, రక్షనయను శిరస్త్రాణమును, వాక్యమను ఖడ్గమును, మరియు ఆత్మలో ప్రార్థించుట. ఈ ఆత్మీయ యుద్దోపకరణ భాగములు ఆత్మీయ పోరాటంలో దేనికి ప్రాతినిధ్యం వహించును? మనము సత్యమును తెలుసుకొని, సత్యమును నమ్మి, మరియు సత్యమును మాటలాడవలెను. క్రీస్తు మన కొరకు అర్పిoపబడిన కారణంగా మనము నీతిమంతులుగ ప్రకటింపబడ్డామనే వాస్తవములో మనము విశ్రాంతి పొందాలి. ఎంత అడ్డగిoపును ఎదుర్కొన్నా మనము సువార్తను ప్రకటించాలి. మనము విశ్వాసములో బలహీనులము కాక, ఎంత బలముగా దాడిచేయబడినప్పటికీ దేవుని వాగ్దానములను నమ్ముచూనే ఉండాలి. మన అంతిమ బలం మన రక్షణను బట్టి మనకున్న నిర్ధారణ, యే ఆత్మీయ శక్తి తీసివేయలేని నిర్ధారణ. మనము ఎదుర్కొనే ఆయుధము మన స్వంత భావాలు మరియు ఆలోచనలు కాదు కాని దేవుని వాక్యము. మరియు మనము శక్తితో మరియు పరిశుద్ధాత్మ చిత్తములో ప్రార్థించవలెను.

యేసు మనకు ఆత్మీయ పోరాటంలో శోధన జయించుటకు అంతిమ ఉదాహరణ. అరణ్యములో సాతానుచే ప్రత్యక్షముగా దాడిచేయబడి ఆయన శోధింపబడినప్పుడు యేసు ఎలా ఎదుర్కొన్నాడో గమనించండి (మత్తయి 4:1-11). ప్రతి శోధన “ఇలాగు వ్రాయబడెను” అనే పదాలతో యుద్ధము. జీవించియున్న దేవుని వాక్యం సాతాను శోధనలను ఎదిరించుటకు చాలా శక్తివంతమైన ఆయుధము. “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను” (కీర్తనలు 119:11).

ఆత్మీయ పోరాటానికి జాగ్రత్తగా ఒక మాట క్రమములో ఉంది. లేఖనములలో ఎక్కడా మనకు దురాత్మలను వెళ్ళగొట్టమని లేక వాటితో మాటలడుమని సూచింపబడలేదు. మన ముందు నుండి దురాత్మలు పారిపోవుటకు యేసు నామము మాయచేసి మైమరపించేది కాదు. వారికివ్వబడని అధికారమును ప్రజలు బాధ్యతవహిస్తే ఏమి జరుగునో దానికి స్కెవ ఏడుగురు కుమారులు ఒక ఉదాహరణ (అపొ. 19:13-16). ప్రధాన దూతయైన మిఖాయేలు కూడా తన స్వశక్తితో సాతానును గద్దించక, “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అనెను (యూదా 1:9). మనము అపవాదితో మాట్లాడుట ప్రారంభించినప్పుడు, అవ్వ వలే దారితప్పింపబడే ప్రమాదంలో పడతాము (ఆదికాండము 3:1-7). మన దృష్టి దేవునిపైనే గాని దురాత్మలపై కాదు; మనము వాటితోకాదు కాని, ఆయనతో మాట్లాడుదము.

సారాంశములో, ఆత్మీయ పోరాటంలో విజయమునకు మూలాలు ఏమిటి? మనము మన స్వశక్తిపై కాకుండా దేవుని శక్తిపై ఆనుకొందుము. మనము మొత్తము దేవుని కవచములను ధరించుకొందము. లేఖనము యొక్క శక్తిపై ఆధారపడి- దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. మనము మన విన్నపములను చేయుచూ, ఎడతెగక మరియు పరిశుద్ధతలో ప్రార్ధించుదము. మనము స్థిరముగా నిలువబడి (ఎఫెసీ. 6:13-14); మనము దేవునికి లోబడి; మనము అపవాది తంత్రములను ఎదిరించి(యాకోబు 4:7), సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు రక్షకుడని తెలిసికొందము. “ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తయిన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను (కీర్తనలు 62:2).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

ఆత్మీయ పోరాటం గూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.