ఆదికాండములోని ప్రజలు ఎందుకు అట్టి సుదీర్ఘకాలిక జీవితములను జీవించారు?

ప్రశ్న ఆదికాండములోని ప్రజలు ఎందుకు అట్టి సుదీర్ఘకాలిక జీవితములను జీవించారు? జవాబు ఆదికాండములోని మొదటి కొన్ని అధ్యాయములలో ప్రజలు అంతటి సుదీర్ఘమైన జీవితములను ఎందుకు జీవించారో అనేది కొంతమేర రహస్యముగానే ఉంది. పరిశుద్ధగ్రంధ పండితులచే అనేకమైన సిద్ధాంతములు ప్రతిపాదించబడ్డాయి. ఆదికాండము 5వ అధ్యాయములో ఉన్న వంశావళి ఆదాము నుండి వెలువడిన దైవికమైన సంతానమును గూర్చి నమోదు చేస్తూ ఉంది – ఈ వంశావళే ఆఖరుకు మెస్సియాను ఉత్పన్నం చేస్తుంది. దేవుడు ఈ వంశావళి ప్రత్యేకంగా ఆశీర్వదించాడు, ప్రత్యేకంగా…

ప్రశ్న

ఆదికాండములోని ప్రజలు ఎందుకు అట్టి సుదీర్ఘకాలిక జీవితములను జీవించారు?

జవాబు

ఆదికాండములోని మొదటి కొన్ని అధ్యాయములలో ప్రజలు అంతటి సుదీర్ఘమైన జీవితములను ఎందుకు జీవించారో అనేది కొంతమేర రహస్యముగానే ఉంది. పరిశుద్ధగ్రంధ పండితులచే అనేకమైన సిద్ధాంతములు ప్రతిపాదించబడ్డాయి. ఆదికాండము 5వ అధ్యాయములో ఉన్న వంశావళి ఆదాము నుండి వెలువడిన దైవికమైన సంతానమును గూర్చి నమోదు చేస్తూ ఉంది – ఈ వంశావళే ఆఖరుకు మెస్సియాను ఉత్పన్నం చేస్తుంది. దేవుడు ఈ వంశావళి ప్రత్యేకంగా ఆశీర్వదించాడు, ప్రత్యేకంగా వారి దైవత్వము మరియు విధేయత కారణంగా వారిని దీర్ఘాయువుతో దీవించాడు. ఇది సాధ్యమగు ఒక వివరణే అయినప్పటికీ, సుదీర్ఘకాల జీవితములను పరిశుద్ధ గ్రంధము ఆదికాండము 5వ అధ్యాయములో మాత్రమే ఇవ్వబడిన వ్యక్తులతో పరిమితము చేయుటలేదు. ఇంకా చూస్తే, హనోకు మినహా, ఆదికాండము 5వ అధ్యాయము ఎవరిని కూడా అంతటి దైవికమైన వారిగా గుర్తించుటలేదు. ఆ కాలములో బహుశ ప్రతి ఒక్కరు కూడా అనేక వందల సంవత్సరములు జీవించి ఉంటారు అనేది సాధ్యం. దీనికి అనేకమైన కారణాలు తోడయ్యాయి.

ఆదికాండము 1:6-7 వచనములు విశాలమునకు పైన ఉన్న నీటిని, అంటే భూమిని ఆవరించియున్న నీటిఛత్రాన్ని ప్రస్తావిస్తున్నాయి. అట్టి ఒక నీటి ఛత్రము హరితగృహ ప్రభావాన్ని సృష్టించి ఈకాలములో ఈ భూమిని తాకుతున్న అనేకమైన సూర్య కిరణాలను ఆపేవి కాబోలు. ఇది అనుకూలమైన జీవన పరిస్థితులను సృష్టించి ఉంటుంది. ఆదికాండము 7:11వ వచనము జలప్రళయ కాలములో ఈ నీటి ఛత్రము ఈ భూమిపై పోయబడినది, తద్వారా అనుకూలమైన జీవనజ్ పరిస్థితులు అంతమొందాయి అని సూచిస్తుంది. జలప్రళయమునకు ముందు జీవితముల యొక్క వ్యవధిని (ఆదికాండము 5:1-32), జలప్రళయము తరువాతి జీవితముల యొక్క వ్యవధిని (ఆదికాండము 11:10-32) పరిశీలించండి. జలప్రళయము వచ్చిన తరువాత వెంటనే, జీవితకాల వ్యవధులు గణనీయంగా తగ్గిపోయాయి.

మరొక ఆలోచన ఏమనగా సృష్టికి మొదటి కొన్ని తరముల తరువాత, మానవుల యొక్క జన్యు స్మృతి కొన్ని లోపాలను వృద్ధిచేసుకుంది. ఆదాము మరియు హవ్వలు పరిపూర్ణులుగా చేయబడ్డారు. వారు ఖచ్చితముగా జబ్బులకు మరియు బలహీనతలకు ఉన్నతముగా నిరోధక శక్తిని పొండుకొనియున్నారు. వారి యొక్క సంతానము వారు ఈ లాభమును పొందుకొని ఉంటారు, అంటే కొంచెం తక్కువ మోతాదులోనే అనుకుందాం. కాలక్రమంలో, పాప కారణంగా, మానవుని జన్యు స్మృతి అధికంగా చెడిపోయి, మానవులు అంతకంతగా మరణమునకు మరియు బలహీనతలకు లోనగుట ప్రారంభించారు. దీని ఫలితంగా జీవిత కాలవ్యవధులు గణనీయంగా తగ్గిపోయి ఉంటాయి.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

ఆదికాండములోని ప్రజలు ఎందుకు అట్టి సుదీర్ఘకాలిక జీవితములను జీవించారు?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.