ఒకే విషయం గూర్చి మళ్ళీ మళ్ళీ ప్రార్థించడం అంగీకరించబడుతుoదా లేక ఒకసారే అడగాలా?

ప్రశ్న ఒకే విషయం గూర్చి మళ్ళీ మళ్ళీ ప్రార్థించడం అంగీకరించబడుతుoదా లేక ఒకసారే అడగాలా? జవాబు లూకా 18:1-7లో, యేసు విసుకక ప్రార్థించడం యొక్క ప్రాముఖ్యతకు ఉదాహరణగా ఒక ఉపమానమును వాడెను. అతడు ఒక విధవరాలు తనకు తన ప్రతివాదికి న్యాయం చేయుమని ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చిన కధను చెప్పుచుండెను. ఆమె ఎడతెగని ప్రార్థన వలన, ఆ న్యాయాధిపతి మానుకొనెను. యేసు యొక్క భావన ఒకవేళ ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఒకరు పట్టువదలకుండా న్యాయం…

ప్రశ్న

ఒకే విషయం గూర్చి మళ్ళీ మళ్ళీ ప్రార్థించడం అంగీకరించబడుతుoదా లేక ఒకసారే అడగాలా?

జవాబు

లూకా 18:1-7లో, యేసు విసుకక ప్రార్థించడం యొక్క ప్రాముఖ్యతకు ఉదాహరణగా ఒక ఉపమానమును వాడెను. అతడు ఒక విధవరాలు తనకు తన ప్రతివాదికి న్యాయం చేయుమని ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చిన కధను చెప్పుచుండెను. ఆమె ఎడతెగని ప్రార్థన వలన, ఆ న్యాయాధిపతి మానుకొనెను. యేసు యొక్క భావన ఒకవేళ ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఒకరు పట్టువదలకుండా న్యాయం కోసం విన్నవిoచినప్పుడు దానిని మంజూరుచేస్తే, మనలను ప్రేమిoచే దేవుడు ఇంకెంతలా చేయును- “తాను ఏర్పరచుకొనినవారు” (వ. 7) – మనము ప్రార్థిస్తూవున్నప్పుడు మనకు జవాబిచ్చును? ఆ ఉపమానము, అది తప్పుగా ఆలోచించినట్లు, ఒకవేళ మనము ఒక విషయమై పదే పదే ప్రార్థిస్తే, దేవుడు అది మనకు ఇచ్చుటకు బద్ధుడైయుండును. దానికన్నా, దేవుడు తనవారికి ప్రతీకారంచేయుటకు, వారికి న్యాయం చేయుటకు, తప్పులను సరిచేయుటకు, మరియు వారి విరోధులనుండి వారిని విడిపించుటకు వాగ్దానం చేయును. ఆయన దీనిని ఆయన న్యాయమును బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, మరియు ఆయన పాపమును ద్వేషించుటను బట్టి; ప్రార్థనకు జవాబిచ్చుటలో, ఆయన తన వాగ్దానమును నిలబెట్టుకొనుటకు మరియు శక్తిని కనుపరచుటకు చేసెను.

యేసు ప్రార్థనకు ఇంకొక ఉదాహరణ లూకా 11:5-12లో ఇచ్చెను. అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఉపమానము వలే, ఈ ప్రకరణములో యేసు యొక్క వర్తమానము ఒకవేళ ఒక మనుష్యుడు అవసరంలో ఉన్న సహోదరునికి సహాయపడుటకు తననుతాను అసౌకర్యపరచుకొంటే, దేవుడు మన అవసతరతలను మరిఎక్కువగా తీర్చును, ఎందుకంటే ఆయనకు యే అభ్యర్థన అసౌకర్యం కాదు. ఇక్కడ మరలా, ఒకవేళ మనము అడుగుతూ ఉంటే మనము ఏది అడిగినను పొందుకుంటామని వాగ్దానం కాదు. ఆయన పిల్లలకు దేవుని వాగ్దానము మన అవసరాలను తీర్చు వాగ్దానమే కాని, మన కోరికలను తీర్చు వాగ్దానం కాదు. మరియు ఆయనకు మనకంటే మన అవసరాలగూర్చి బాగుగా తెలుసు. ఇదే వాగ్దానం మత్తయి 7:7-11 మరియు లూకా 11:13లో పునరుద్ఘాటించబడెను, ఎక్కడైతే “దేవుని బహుమానము” పరిశుద్ధాత్మగా మరింత వర్ణించబడెను.

ఈ రెండు ప్రకరణలు ప్రార్ధించుటకు మరియు ప్రార్థిస్తూనే ఉండుటకు ప్రోత్సహించును. ఒకే విషయం గూర్చి మరలా అడుగుటలో యే తప్పు లేదు. నీవు ప్రార్థించేది దేవుని చిత్తములో ఉన్నంతవరకు (1 యోహాను 5:14-15), దేవుడు ఆ అభ్యర్థనను మంజూరు చేసేంత వరకు అడుగుతూ ఉండడం లేక ఆ కోరికను నీ హృదయంలోనుండి తీసివేయడం. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు సమాధానం కొరకు వేచియుండేలా బలవంతం చేసి మనకు సహనము మరియు పట్టుదల బోధించును. కొన్నిసార్లు మన జీవితాలలో ఇంకా దేవుని సమయములో లేని వాటిగూర్చి అడుగుతుంటాము. కొన్నిసార్లు మనము మనపట్ల దేవుని చిత్తము కానిది అడుగుతాము, మరియు ఆయన “వద్దు” అని చెప్పును. ప్రార్థన కేవలం మన విన్నపములను దేవునికి సమర్పించడం కాదు కాని; అది దేవుని చిత్తమును మన హృదయాలకు ప్రదర్శిస్తుంది. దేవుడు మీ విన్నపమును తీర్చి లేక ఆయన నీ విన్నపం ఆయన చిత్తం కాదని ఒప్పింపబడే వరకు అడుగుతూ వుండడం, తడుతూ ఉండడం, మరియు వెదుకుతూ ఉండడం.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

ఒకే విషయం గూర్చి మళ్ళీ మళ్ళీ ప్రార్థించడం అంగీకరించబడుతుoదా లేక ఒకసారే అడగాలా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.