క్రైస్తవుడు వ్యాయామం చేయాలా? ఆరోగ్యమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

ప్రశ్న క్రైస్తవుడు వ్యాయామం చేయాలా? ఆరోగ్యమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? జవాబు జీవితంలో అనేక విషయాల వలే, వ్యాయామంలో కూడా తీవ్రత ఉన్నది. కొంతమంది ప్రజలు పరిపూర్ణంగా ఆత్మీయతపైనే దృష్టిపెడతారు, భౌతిక శరీరమును పట్టించుకొనరు. ఇంకొంతమంది తమ భౌతిక శరీరక రూపం మరియు ఆకృతిపై దృష్టి పెట్టి ఆత్మీయ అభివృద్ధిని మరియు పరిపక్వతను విస్మరిస్తారు. ఈ రెండింటిలో ఏదీ కూడ సంతులంను సూచించదు. మొదటి తిమోతి 4:8 మనకు ఈ విధంగా తెలియజేస్తుంది, “శరీర సంబంధమైన…

ప్రశ్న

క్రైస్తవుడు వ్యాయామం చేయాలా? ఆరోగ్యమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు

జీవితంలో అనేక విషయాల వలే, వ్యాయామంలో కూడా తీవ్రత ఉన్నది. కొంతమంది ప్రజలు పరిపూర్ణంగా ఆత్మీయతపైనే దృష్టిపెడతారు, భౌతిక శరీరమును పట్టించుకొనరు. ఇంకొంతమంది తమ భౌతిక శరీరక రూపం మరియు ఆకృతిపై దృష్టి పెట్టి ఆత్మీయ అభివృద్ధిని మరియు పరిపక్వతను విస్మరిస్తారు. ఈ రెండింటిలో ఏదీ కూడ సంతులంను సూచించదు. మొదటి తిమోతి 4:8 మనకు ఈ విధంగా తెలియజేస్తుంది, “శరీర సంబంధమైన సాధకము కొంచముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది ఉన్న విషయములలో ప్రయోజనకరమవును.” వ్యాయామమును తిరస్కరిస్తుందని ఈ వచనము యొక్క అర్థం కాదని గమనించాలి. బదులుగా, ఇది వ్యాయామం విలువైనదని చెప్తుంది, కానీ అది వ్యాయామమునకు ఖచ్చితంగా ప్రాధాన్యతను ఇస్తుంది కానీ దైవత్వం ఎక్కువ విలువైనది.

1 కొరింథీయులకు 9:24-27లో ఆత్మీయ సత్యమును గూర్చి వివరిస్తున్నప్పుడు అపోస్తులుడైన పౌలు భౌతిక శిక్షణను గూర్చి చెప్పాడు. మేము “బహుమానము పొందుటకు” పరిగెడుతున్నాము అనుదానితో క్రైస్తవ జీవితమును సమానపరుస్తున్నాడు. కానీ మనం ఎదురు చూసే ఈ బహుమానం పోగొట్టుకొనేది మరియు వాడిపోయేది కాదు శాశ్వతమైన కిరీటం. 1 తిమోతి 2:5లో పౌలు ఈ విధంగా చెప్పాడు, “జెట్టియైనవాడు పోరాడునప్పుడు నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.” 2 తిమోతి 4:7లో మరొకసారి క్రీడా సారూప్యతను పౌలు వినియోగించాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.” ఈ వాక్యముల యొక్క దృష్టి భౌతిక వ్యాయామంపై లేదు, వాస్తవానికి మనకు ఆత్మీయ సత్యాలను బోధించుటకుపౌలు యొక్క క్రీడా పదజాల వినియోగం పౌలు భౌతిక వ్యాయామమును మరియు పోటీని సానుకూల దృష్టిలో చూసాడని తెలియజేస్తుంది. మనం ఆత్మీయ మరియు శరీర జీవులం. బైబిల్ ప్రకారంగా మాట్లాడుతూ, మన ఆత్మీయ కోణం ప్రాముఖ్యమైంది, కాబట్టి మనం మన జీవిత ఆత్మీయ మరియు శారీరక కోణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

కాబట్టి, స్పష్టంగా, క్రైస్తవుడు వ్యాయామం చేయడంలో తప్పేమీ లేదు. వాస్తవానికి, మన దేహాల పట్ల జాగ్రత్తగా శ్రద్ధ వహించాలని బైబిల్ స్పష్టం చేస్తుంది (1 కొరింథీ 6:19-20). అదే సమయంలో, వ్యర్థమునకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది (1 సమూయేలు 16:7; సామెతలు 31:30; 1 పేతురు 3:3-4). వ్యాయామంలో మన గమ్యం మన శరీరాలను అభివృద్ధి చేసుకోవడం ద్వార ఇతరులు మనలను గ్రహించి మెచ్చుకుంటారని కాదు. బదులుగా, వ్యాయామం చేస్తున్నప్పుడు మన లక్ష్యం ఏంటంటే మన భౌతిక ఆరోగ్యమును అభివృద్ధి చేసుకొని శారీరక శక్తిని పెంచుకొని తద్వార ఆత్మీయ లక్ష్యాలకు అంకితపరచుకోవాలి.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

క్రైస్తవుడు వ్యాయామం చేయాలా? ఆరోగ్యమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.