క్రైస్తవులు భూ చట్టాలను పాటించాలా?

ప్రశ్న క్రైస్తవులు భూ చట్టాలను పాటించాలా? జవాబు రోమా 13:1-7 ప్రకటించును, “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండకోరితివా, మేలుచేయుము, అప్పుడు…

ప్రశ్న

క్రైస్తవులు భూ చట్టాలను పాటించాలా?

జవాబు

రోమా 13:1-7 ప్రకటించును, “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండకోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరిoపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.”

ఈ ప్రకరణ దేవుడు మనపై నియమించిన ప్రభుత్వమునకు మనము విధేయత చూపాలని సమృద్ధిగా స్పష్టము చేయును. దేవుడు ప్రభుత్వమును క్రమము, చెడును శిక్షించి, మరియు న్యాయము జరిగించుటకు స్థాపించెను (ఆదికాండము 9:6; 1 కొరింథీ 14:33; రోమా 12:8). మనము ప్రభుత్వమునకు ప్రతి విషయములోను విధేయత చూపాలి – పన్నులు చెల్లించుట, చట్టమును మరియు నియమాలను పాటించుట, మరియు సన్మానము చూపుట. ఒకవేళ మనము చేయకపోతే, మనము చివరికి దేవునిపట్ల అవిధేయత చూపుచున్నట్లు, ఎందుకంటే మన మీద ప్రభుత్వమును నియమించినది ఆయనే. అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసినప్పుడు, అతడు నీరో పరిపాలనలో రోమా ప్రభుత్వము క్రింద ఉండెను, బహుశా రోమా చక్రవర్తులందరికంటే చాలా దుర్మార్గుడు. పౌలు అయినా తనపై రోమా ప్రభుత్వమును గుర్తించెను. ఎలా మనము ఏమి తక్కువ చేయాలి?

తర్వాత ప్రశ్న “భూ చట్టాలను కావాలని మనము పాటించకుండా ఉండుటకు ఏదైనా ఒక సమయం ఎప్పుడైనా ఉంటుందా?” ఆ ప్రశ్నకు సమాధానం అపొ 5:27-29లో దొరకవచ్చు, “వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి- మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపొస్తలులును-మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.” దీని నుండి, దేవుని నియమములను భూ చట్టాలు విరోధించకుండా ఉన్నంతవరకు, మనము భూ చట్టాలను పాటించాలి అని స్పష్టము చేయబడును. దేవుని నియమమును భూ చట్టము విభేదించిన వెంటనే, మనము భూ చట్టాలను పాటించకుండా దేవుని నియమమును పాటించాలి. అయితే, ఆ సమయంలో కూడా, మనము మనపై ప్రభుత్వమునకు ఉన్న అధికారమును అంగీకరించాలి. ఇది పేతురు మరియు యోహాను దెబ్బలు తినినా, కాని దాని బదులుగా దేవునికి విధేయత చూపుటను బట్టి శ్రమలో ఆనందించి వాస్తవముగా ప్రదర్శించెను (అపొ. 5:40-42).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

క్రైస్తవులు భూ చట్టాలను పాటించాలా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.