దంపతులు వివాహమునకు ముందు కలిసి జీవించడం తప్పా?

ప్రశ్న దంపతులు వివాహమునకు ముందు కలిసి జీవించడం తప్పా? జవాబు ఈ ప్రశ్నకు సమాధానం “కలసి జీవించుట” అంటే ఏంటి అనుదానిపై ఆధారపడి ఉంది. ఒకవేళ లైంగిక సంబంధం కలిగి ఉండడం దీని అర్థం ఐతే, అది ఖచ్చితంగా తప్పు. వాక్యంలో ఇతర లైంగిక సంబంధమైన జారత్వాలతో కలిపి వివాహమునకు ముందు లైంగిక సంబంధమును తరచుగా ఖండిస్తుంది (అపొ.కా. 15:20; రోమా 1:29; 1 కొరింథీ. 5:1; 6:13, 18; 7:2; 10:8; 2 కొరింథీ. 12:21;…

ప్రశ్న

దంపతులు వివాహమునకు ముందు కలిసి జీవించడం తప్పా?

జవాబు

ఈ ప్రశ్నకు సమాధానం “కలసి జీవించుట” అంటే ఏంటి అనుదానిపై ఆధారపడి ఉంది. ఒకవేళ లైంగిక సంబంధం కలిగి ఉండడం దీని అర్థం ఐతే, అది ఖచ్చితంగా తప్పు. వాక్యంలో ఇతర లైంగిక సంబంధమైన జారత్వాలతో కలిపి వివాహమునకు ముందు లైంగిక సంబంధమును తరచుగా ఖండిస్తుంది (అపొ.కా. 15:20; రోమా 1:29; 1 కొరింథీ. 5:1; 6:13, 18; 7:2; 10:8; 2 కొరింథీ. 12:21; గలతీ. 5:19; ఎఫెసీ. 5:3; కొలస్సీ. 3:5; 1 థెస్స. 4:3; యూదా 7). వివాహమునకు వెలుపల (మరియు ముందు) సంపూర్ణ సంయమనాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది. వివాహానికి ముందు లైంగిక సంబంధం ఇతర జారత్వములకు సమానంగా తప్పు, ఎందుకంటే అవనీ నీవు వివాహమాడని ఒకరితో లైంగిక సంబంధంలో పాలుపొందుట.

ఒకవేళ “కలసి జీవించుట” అంటే ఒకే ఇంట్లో నివశించడం, అది బహుశా వేరే విషయం. చివరిగా, అనైతికమైనది ఏదీ కూడా చోటుచేసుకొనకపోతే ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒకే ఇంట్లో నివశించడం తప్పు కాదు. అయితే, దానిలో వచ్చే సమస్య ఏంటంటే జారత్వము రూపం కనిపిస్తుంది (1 థెస్స. 5:22; ఎఫెసీ 5:3), మరియు అడి జారత్వంలో పడిపోవుటకు ప్రోత్సాహంగా ఉంటుంది. జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని బైబిల్ చెప్తుంది, జారత్వంలోకి తరచు మనలను పడవేయ్యాలని కోరికపెట్టె వాటి నుండి తప్పుకోవాలి (1 కొరింథీ 6:18). అప్పుడు సమస్య కూడా వెలువడుతుంది. కలసి నివసించే దంపతులు కలసి పడుకొంటున్నారనే భావనను తెస్తుంది – అది సహజం. ఒకే యింట్లో నివశించడం పాపం కానప్పటికీ, అక్కడ పాపం అగుపడుతుంది. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండండి అని బైబిల్ చెప్తుంది (1 థెస్స. 5:3), జారత్వముకు దూరముగా పారిపోవుడి, మరియు ఎవరినీ బాధపెట్టవద్దు లేదా మనస్తాపానికి గురి చేయవద్దు. ఫలితంగా, వివాహానికి వెలుపల స్త్రీ పురుషులు కలసి నివసించడం దేవునికి గౌరవార్ధంగా ఉండదు.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

దంపతులు వివాహమునకు ముందు కలిసి జీవించడం తప్పా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.