దేవుడు నేటు కూడా మనతో మాట్లాడుతున్నాడా?

ప్రశ్న దేవుడు నేటు కూడా మనతో మాట్లాడుతున్నాడా? జవాబు దేవుడు ప్రజలతో స్పష్టముగా మాట్లాడిన అనేక పర్యాయములను బైబిల్ లిఖిస్తుంది (నిర్గమ. 3:14; యెహోషువ 1:1; న్యాయాధి. 6:18; 1 సమూ. 3:11; 2 సమూ. 2:1; యోబు 40:1; యెషయా 7:3; యిర్మీయా. 1:7; అపొ. 8:26; 9:15–ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే). నేడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడు అనుటకు ఎలాంటి బైబిల్ కారణం లేదు. దేవుడు మాట్లాడుటను గూర్చి బైబిల్ మాట్లాడిన…

ప్రశ్న

దేవుడు నేటు కూడా మనతో మాట్లాడుతున్నాడా?

జవాబు

దేవుడు ప్రజలతో స్పష్టముగా మాట్లాడిన అనేక పర్యాయములను బైబిల్ లిఖిస్తుంది (నిర్గమ. 3:14; యెహోషువ 1:1; న్యాయాధి. 6:18; 1 సమూ. 3:11; 2 సమూ. 2:1; యోబు 40:1; యెషయా 7:3; యిర్మీయా. 1:7; అపొ. 8:26; 9:15–ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే). నేడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడు అనుటకు ఎలాంటి బైబిల్ కారణం లేదు. దేవుడు మాట్లాడుటను గూర్చి బైబిల్ మాట్లాడిన వందల పర్యాయములలో, అవి మానవ చరిత్రలో 4,000 సంవత్సరాల వ్యవధిలో జరిగాయని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు స్పష్టముగా మాట్లాడుట ఒక ఆశ, అది ఒక నియమం కాదు. బైబిల్ లో లిఖించబడిన దేవుడు మాట్లాడిన సన్నివేశాలలో కూడా, అది వినిపించు స్వరమా, లేక లోపల స్వరమా, లేక మానసిక భావనా అని స్పష్టముగా చెప్పబడలేదు.

దేవుడు నేడు కూడా ప్రజలతో మాట్లాడతాడు. మొదటిగా, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు (2 తిమోతి 3:16–17). “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును” అని యెషయా 55:11 చెబుతుంది. బైబిల్ దేవుని వాక్యమైయుంది, రక్షణ పొందుటకు మరియు క్రైస్తవ జీవితమును జీవించుటకు మనకు అవసరమైన ప్రతిది దానిలో ఉంది. “దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక” అని 2 పేతురు 1:3 ప్రకటిస్తుంది.

దేవుడు మనతో సంఘటనల ద్వారా కూడా “మాట్లాడతాడు”-అనగా, మన పరిస్థితులను నిర్మించుట ద్వారా ఆయన మనకు మార్గదర్శకం ఇవ్వగలడు. మరియు మన మనస్సాక్షి ద్వారా మంచి నుండి చెడును వివేచించుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు (1 తిమోతి 1:5; 1 పేతురు 3:16). ఆయన ఆలోచనలను ఆలోచించుటకు దేవుడు మన మనస్సులను సిద్ధపరుస్తడు (రోమా. 12:2). మనలను నడిపించుటకు, మార్చుటకు, మరియు ఆత్మీయంగా ఎదుగుటలో సహాయపడుటకు మన జీవితాలలో సంఘటనలు జరుగుటకు దేవుడు అనుమతి ఇస్తాడు (యాకోబు 1:2–5; హెబ్రీ. 12:5–11). “ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును” అని 1 పేతురు 1:6–7 మనకు జ్ఞాపకం చేస్తుంది.

దేవుడు కొన్ని సార్లు స్పష్టమైన స్వరంతో ప్రజలతో మాట్లాడవచ్చు. అయితే, కొందరు చెబుతున్నట్లు అనేక సార్లు దేవుడు మాట్లాడుట మాత్రం సందేహమును కలిగిస్తుంది. మరలా, బైబిల్ లో కూడా, దేవుడు స్పష్టమైన స్వరంతో మాట్లాడుట సామాన్యము కాదుగాని, విశేషమైనది. దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరైనా దావా చేసినయెడల, వారు చెప్పినదానిని ఎల్లప్పుడూ బైబిల్ చెప్పిన దానితో పోల్చండి. నేడు దేవుడు మాట్లాడవలసియుంటే, ఆయన చెప్పు మాటలు బైబిల్ తో పరిపూర్ణ సమ్మతి కలిగియుంటాయి (2 తిమోతి 3:16–17). దేవుడు తన్ను తాను వ్యతిరేకించడు.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

దేవుడు నేటు కూడా మనతో మాట్లాడుతున్నాడా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *