నా ఆత్మ వరము ఏమిటో నేను ఎలా తెలుసుకోగలను?

ప్రశ్న నా ఆత్మ వరము ఏమిటో నేను ఎలా తెలుసుకోగలను? జవాబు మన ఆత్మ వరములు ఏమిటో తెలుసుకొనుటకు ఒక మేజిక్ నియమము లేక ఖచ్చితమైన పరీక్ష లేదు. తన ఆలోచన ప్రకారంగా పరిశుద్ధాత్మ తన వరములను పంచుతాడు (1 కొరింథీ. 12:7-11). ఒక క్రైస్తవుడు తన ఆత్మ వరములో ఎంతగా ఇరుక్కుపోతాడంటే, కేవలం ఆ వరముకు సంబంధించిన విషయములో మాత్రమే దేవుని సేవ చేయుటకు చూచే శోధనలో పడుట క్రైస్తువులు ఎదుర్కొనే సామాన్యమైన సమస్య. ఆత్మ…

ప్రశ్న

నా ఆత్మ వరము ఏమిటో నేను ఎలా తెలుసుకోగలను?

జవాబు

మన ఆత్మ వరములు ఏమిటో తెలుసుకొనుటకు ఒక మేజిక్ నియమము లేక ఖచ్చితమైన పరీక్ష లేదు. తన ఆలోచన ప్రకారంగా పరిశుద్ధాత్మ తన వరములను పంచుతాడు (1 కొరింథీ. 12:7-11). ఒక క్రైస్తవుడు తన ఆత్మ వరములో ఎంతగా ఇరుక్కుపోతాడంటే, కేవలం ఆ వరముకు సంబంధించిన విషయములో మాత్రమే దేవుని సేవ చేయుటకు చూచే శోధనలో పడుట క్రైస్తువులు ఎదుర్కొనే సామాన్యమైన సమస్య. ఆత్మ వరములు ఆ విధంగా పని చేయవు. అన్ని విషయములలో విధేయులుగా ఆయనను సేవించాలని దేవుడు కోరుతున్నాడు. మనలను పిలచిన పనిని చేయుటకు కావలసిన వరములన్నిటితో ఆయన మనలను నింపుతాడు.

మన ఆత్మ వరములను కనుగొనుట అనేక విధములుగా చేయవచ్చు. ఆత్మ వరము పరీక్షలు, వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు, మన వరములు ఏవో గ్రహించుటకు మనకు నిశ్చయముగా సహాయం చేస్తాయి. ఇతరుల ద్వారా నిర్థారణ కూడా మన ఆత్మ వరములపై కొంత వెలుగును చూపుతుంది. దేవుని సేవించుటలో మనలను చూచు ఇతర ప్రజలు, మనం గ్రహించని లేక పెద్దగా పట్టించుకోని ఆత్మ వరమును గుర్తించవచ్చు. మన ఆత్మ వరములు ఏమిటో ఖచ్చితముగా ఎరిగిన ఒక వ్యక్తి స్వయంగా వరమును ఇచ్చువాడు-పరిశుద్ధాత్మ. ఆయన మహిమ కొరకు మన ఆత్మీయ వరములను ఉపయోగించుట కొరకు మన వరములు ఏమిటో చూపమని దేవుని అడగవచ్చు.

అవును, దేవుడు కొందరిని బోధకులుగా పిలచి, వారికి బోధా వరము ఇవ్వవచ్చు. దేవుడు కొందరిని పరిచారకులుగా పిలచి పరిచర్య చేయు వరం ఇవ్వవచ్చు. అయితే, దేవుడు మనకు ఇచ్చిన వరమును తెలుసుకొనుట మనం ఇతర విషయాలలో దేవుని సేవించకుండా ఉండుటకు అనుమతి ఇవ్వదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ వరములు ఏవో తెలుసుకొనుట ఉపయోగకరమా? అవును ఉపయోగకరమే. మన ఆత్మీయ వరములపై అధిక దృష్టి ఉంచి ఇతర విషయాలలో దేవుని సేవించు అవకాశాలను కోల్పోవుట తప్పా? అవును. దేవునిచే వాడబడుటకు మనం సమర్పణ కలిగియున్న యెడల, మనకు కావలసిన ఆత్మీయ వరములతో ఆయన మనలను నింపుతాడు.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

నా ఆత్మ వరము ఏమిటో నేను ఎలా తెలుసుకోగలను?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *