పరలోకంల

ప్రశ్న పరలోకంలో ఉన్న మన స్నేహితులను మరియు కుటుంబస్తులను మనం చూడగలమా మరియు వారు అక్కడ ఉన్నారని తెలుసుకొనగలమా? జవాబు అనేకమంది ప్రజలు ఈ విధంగా చెప్తారు వారు పరలోకంలోకి వెళ్ళినప్పుడు వారు చేసే మొదటి కార్యము వారి కంటే ముందు చనిపోయిన తమ ప్రియులు మరియు స్నేహితులను చూడడం. నిత్యత్వంలో, మన స్నేహితులతో మరియు కుటుంబీకులను చూచుటకు, తెలుసుకొనుటకు, మరియు సమయం గడుపుటకు ఎక్కువ సమయం ఉంటుంది. అయితే, పరలోకంలో అది కాదు మన ప్రథమ…

ప్రశ్న

పరలోకంలో ఉన్న మన స్నేహితులను మరియు కుటుంబస్తులను మనం చూడగలమా మరియు వారు అక్కడ ఉన్నారని తెలుసుకొనగలమా?

జవాబు

అనేకమంది ప్రజలు ఈ విధంగా చెప్తారు వారు పరలోకంలోకి వెళ్ళినప్పుడు వారు చేసే మొదటి కార్యము వారి కంటే ముందు చనిపోయిన తమ ప్రియులు మరియు స్నేహితులను చూడడం. నిత్యత్వంలో, మన స్నేహితులతో మరియు కుటుంబీకులను చూచుటకు, తెలుసుకొనుటకు, మరియు సమయం గడుపుటకు ఎక్కువ సమయం ఉంటుంది. అయితే, పరలోకంలో అది కాదు మన ప్రథమ దృష్టి. మనం పరలోకంలో అద్భుతాలను చూచుటలో మరియు దేవునిని ఆరాధించుటలో మనం మునుగిపోతాము. మన ప్రియులతో మన పునఃకలయిక అనేవి మన జీవితంలో దేవుని కృపను మరియు మహిమను లెక్కించుటలో, ఆయన అద్భుతమైన ప్రేమను, మరియు ఆయన శక్తిగల కార్యములను లెక్కించుటలో నిండిపోతాము. మనము ఇంకను ఆనందిస్తాము ఎందుకంటే మనం ఇతర విశ్వాసులతో కలసి దేవునిని స్తుతించి మరియు ఆరాధిస్తాము, మరిముఖ్యముగా భూమిపై ప్రేమించబడినవారితో కలసి.

మన తరువాత జన్మలో ప్రజలను గుర్తుపట్టగలమా అన్నదానిని గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? కర్ణపిశాచము ద్వార సమూయేలును మరణావరము నుండి రప్పించుమని కోరినప్పుడు రాజైన సౌలు సమూయేలును గుర్తుపట్టెను (1 సమూ. 28:8-17). దావీదు తన యొక్క పసిబిడ్డయైన కుమారుడు చనిపోయినప్పుడు, దావీదు ఈ విధంగా చెప్పెను, “నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వానితో చెప్పెను” (2 సమూ.12:23). అతడు చనిపోయిననూ పరలోకంలో తాను తన కుమారుని గుర్తుపట్టగలనని అనుకొనియుండవచ్చు. లూకా 16:19-31లో అబ్రాహాము, లాజరు మరియు ధనవంతుడు మరణము తరువాత గుర్తుపట్టగలిగినవారు. రూపాంతర సమయమందు, మోషే మరియు ఎలీష కూడా గుర్తించదగినవారు (మత్తయి17:3-4). ఈ ఉదాహరణలలో, మరణము తరువాత మనం గుర్తు పట్టగలం అని బైబిల్ సూచిస్తుంది.

మనం పరలోకంలోకి ప్రవేశపెట్టినప్పుడు, “మనం ఆయన (యేసు) వలే ఉంటామని బైబిల్ చెప్తుంది; “ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము” (1 యోహాను 3:2). మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, కాబట్టి మన పునరుద్ధాన శరీరము క్రీస్తు వలే ఉంటుంది (1 కొరింథీ. 15:47). “మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది” (1 కొరింథీ 15:49, 53). యేసు పునరుద్ధానము తరువాత అనేకమంది ఆయనను గ్రహించిరి (యోహాను 20:16, 20; 21:12; 1 కొరింథీ 15:4-7). యేసు తన మహిమ శరీరములో గుర్తింపబడినట్లె, మనం కూడ మహిమ శరీరాలలో గుర్తించబడతాము. మన ప్రియులను చూడగలడం అనేది పరలోక అంశం, కానీ పరలోకం అనేది దేవుని గూర్చి ఎక్కువ మరియు మన గూర్చి తక్కువ చెప్తుంది. మన ప్రియులతో తిరిగి కలుసుకొనుట అమరియు వారితో కలసి నిత్యత్వంలో దేవునిని ఆరాధించుట ఎంత గొప్ప ధన్యత.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

పరలోకంలో ఉన్న మన స్నేహితులను మరియు కుటుంబస్తులను మనం చూడగలమా మరియు వారు అక్కడ ఉన్నారని తెలుసుకొనగలమా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.