పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏమిటి?

ప్రశ్న పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏమిటి? జవాబు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును రక్షణ పొందిన క్షణమున విశ్వాసిని క్రీస్తుతోను మరియు క్రీస్తు శరీరములోని ఇతర విశ్వాసులతోను ఐక్యతలోనికి నడుపు దేవుని ఆత్మ యొక్క కార్యముగా నిర్వచించవచ్చు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా (మార్కు 1:8) మరియు పరలోకమునకు ఆరోహణ అగుటకు ముందు యేసు ద్వారా ప్రవచించబడెను: “యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను” (అపొ. 1:5). ఈ…

ప్రశ్న

పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏమిటి?

జవాబు

పరిశుద్ధాత్మ బాప్తిస్మమును రక్షణ పొందిన క్షణమున విశ్వాసిని క్రీస్తుతోను మరియు క్రీస్తు శరీరములోని ఇతర విశ్వాసులతోను ఐక్యతలోనికి నడుపు దేవుని ఆత్మ యొక్క కార్యముగా నిర్వచించవచ్చు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా (మార్కు 1:8) మరియు పరలోకమునకు ఆరోహణ అగుటకు ముందు యేసు ద్వారా ప్రవచించబడెను: “యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను” (అపొ. 1:5). ఈ వాగ్దానము పెంతెకొస్తు దినమున నెరవేరింది (అపొ. 2:1-4); మొదటిసారిగా, పరిశుద్ధాత్మ ప్రజల జీవితాలలో స్థిరముగా నివసించుట ఆరంభించెను, మరియు సంఘము ఆరంభించబడెను.

బైబిల్ లో 1 కొరింథీ. 12:12–13 పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు మూల వాక్యభాగము: “ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు” (1 కొరింథీ. 12:13). “మనమంతా” ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందితిమని గమనించండి-రక్షణకు తోడుగా, అందరు బాప్తిస్మము పొందారు, మరియు ఇది కేవలం కొంత మందికే కలుగు విశేష అనుభవము కాదు. రోమా. 6:1–4 దేవుని ఆత్మను గూర్చి విశేషంగా ప్రస్తావించనప్పటికీ, 1 కొరింథీలోని వాక్యమునకు అనుగుణంగా దేవుని ఎదుట విశ్వాసి యొక్క స్థానమును వివరిస్తుంది: “ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.”

ఆత్మ బాప్తిస్మమును గూర్చి మన అవగాహనను బలపరచుటకు సహాయంచేయుటలో ఈ క్రింది సత్యములు అవసరము: మొదటిగా, అందరికి త్రాగుటకు ఆత్మ ఇవ్వబడినట్లు (ఆత్మ మనలో నివసించుట), అందరు బాప్తిస్మము పొందితిరని 1 కొరింథీ. 12:13 స్పష్టముగా చెబుతుంది. రెండవదిగా, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వెదకుట కొరకు ఆత్మతో, ఆత్మలో, లేక ద్వారా విశ్వాసులు బాప్తిస్మము పొందాలని లేఖనములో ఎక్కడా ఇవ్వబడలేదు. అనగా విశ్వాసులందరు ఇట్టి అనుభవం కలిగియున్నారని ఇది సూచిస్తుంది. మూడవదిగా, ఎఫెసీ. 4:5 ఆత్మ బాప్తిస్మమును సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. అలా అయినయెడల, ఆత్మ బాప్తిస్మము ప్రతి విశ్వాసికి ఒక వాస్తవికత, “ఒకే విశ్వాసం” మరియు “ఒకే తండ్రి”లాగా.

ముగింపులో, పరిశుద్ధాత్మ బాప్తిస్మము రెండు కార్యములను చేస్తుంది, 1) అది మనలను దేవుని శరీరముతో జతపరుస్తుంది, మరియు 2) క్రీస్తుతో సహా మనం సిలువవేయబడుటను అది వాస్తవికం చేస్తుంది. ఆయన శరీరములో ఉండుట అనగా ఆయనతో మనం నూతనత్వములోనికి తిరిగిలేచినట్లు (రోమా. 6:4). అప్పుడు 1 కొరింథీ. 12:13 యొక్క సందర్భము చెప్పునట్లు శరీరము సరిగా పనిచేయుటకు మనం మన ఆత్మీయ వరములను అభ్యసించవలెను. ఎఫెసీ 4:5లో వలె ఒకే ఆత్మ బాప్తిస్మమును అనుభవించుట సంఘము యొక్క ఐక్యతను బలపరచుటకు సహాయపడుతుంది. ఆత్మ బాప్తిస్మము ద్వారా క్రీస్తు మరణం, సమాధి, మరియు పునరుత్థానములో ఆయనతో సహవాసము కలిగియుండుట, మనలో ఉన్న పాపము నుండి విడిపోవుటకు మరియు మన నూతన జీవిత నడకకు పునాదిని నిర్మిస్తుంది (రోమా. 6:1-10; కొలస్సి. 2:12).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏమిటి?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.