పొగ త్రాగుటను గూర్చి క్రైస్తవ అభిప్రాయం ఏమిటి? సిగరెట్ త్రాగడం పాపమా?

ప్రశ్న పొగ త్రాగుటను గూర్చి క్రైస్తవ అభిప్రాయం ఏమిటి? సిగరెట్ త్రాగడం పాపమా? జవాబు పొగత్రాగుటను గూర్చి బైబిల్ ప్రత్యక్షంగా ఏమి చెప్పదు. అయితే, పొగ త్రాగుటకు సంబంధించి ఖచ్చితంగా నియమాలు ఉన్నాయి. మొదట, మన శరీరాలను దేనిచేత కూడా “లోపరచుకొనబడనొల్లనీ” కూడదు అని బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది. “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగనివి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను” (1 కొరింథీ 6:12). ధూమపానం అనేది ఖచ్చితంగా…

ప్రశ్న

పొగ త్రాగుటను గూర్చి క్రైస్తవ అభిప్రాయం ఏమిటి? సిగరెట్ త్రాగడం పాపమా?

జవాబు

పొగత్రాగుటను గూర్చి బైబిల్ ప్రత్యక్షంగా ఏమి చెప్పదు. అయితే, పొగ త్రాగుటకు సంబంధించి ఖచ్చితంగా నియమాలు ఉన్నాయి. మొదట, మన శరీరాలను దేనిచేత కూడా “లోపరచుకొనబడనొల్లనీ” కూడదు అని బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది. “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగనివి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను” (1 కొరింథీ 6:12). ధూమపానం అనేది ఖచ్చితంగా గట్టిగా వ్యసనపరచుకుంటుంది. అదే వాక్యభాగంలో తరువాత యేమని చెప్తుందంటే, “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్దాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” (1 కొరింథీ.6:19-20). ధూమపానం సందేహం లేకుండా మీ ఆరోగ్యమునకు హానికరం. ధూమపానం ఊపిరి తిత్తులను మరియు గుండెను నాశనం చేస్తదని ఋజువు చేయబడింది.

ధూమపానం అనేది “ప్రయోజనకరంగా” పరిగణింపబడుతుందా ( 1 కొరింథీ 6:12)? ధూమపానం అనేది నిజంగా నీ శరీరముతో దేవునిని గౌరవించేది అని చెప్పబడుతుందా (1 కొరింథీ. 6:20)? “దేవుని మహిమ కొరకు” ఒక వ్యక్తి నిజంగా ధూమపానం చేయగలడా (1 కొరింథీ 10:31)? ఈ ప్రశ్నలకు సమాధానం “కాదు” అని మనం నమ్ముతాము. ఫలితంగా, ధూమపానం పాపం అని మనం నమ్ముతాము కాబట్టి యేసు క్రీస్తు అనుచరులు దేనిని పాటించకూడదు.

అనేకమంది ప్రజలు అనారోగ్య తిండిని తింటారని, అవి వ్యసనమువలే శరీరమునకు చెడ్డదిగా పరిగణింపబడు వాస్తవమును నొక్కి చెప్పి కొంతమంది ఈ అభిప్రాయమునకు వ్యతిరేకంగా వాదిస్తారు. ఉదాహరణగా, అనేకమంది ప్రజలు నిస్సహాయంగా కాఫీకి వ్యసనమైపోయారు వారు ఉదయాన మొదటి కప్పు కాఫీ లేకుండా పని చేయలేరు. ఇది నిజమై యుంటుండగా, అది ధూమపానమును సరియైనదిగా ఎలా చేస్తుంది? క్రైస్తవులు అతిగా తినే అలవాటును మానుకోవాలి మరియు అనారోగ్యకరమైన తిండిని అతిగా తినడం మానుకోవాలనేది మన వివాదం. అవును, క్రైస్తవులు తరచుగా ఒక పాపమును ఖండించి మరియు మరొక పాపముతో రాజీపడడం వేషదారణ, కానీ మరల ఇది ధూమపానమును దేవునికి గౌరవించే విధంగా ఉండడు.

ఈ విధమైన వీక్షణకు మరొక వాదన ఏంటంటే అనేక దైవికమైన మనుష్యులు ధూమపానకులు, ఉదాహరణగా ప్రముఖ బ్రిటిష్ బోధకుడు C.H. Spurgeon, ఇతడు సిగరెట్లను పీల్చేవాడిగా పేరుగాంచాడు. మరల, ఈ వాదనకు ప్రాముఖ్యత ఉన్నదో లేదో మనకు నమ్మకం లేదు. Spurgeon ధూమపానముకు చెప్పుకోదగ్గ వాడు కాడు అని మన నమ్మకం. లేకపోతే అతడు దైవికమైన వ్యక్తా లేక దేవుని వాక్యమును బోధించు అద్భుతమైన ఉపాధ్యాయుడా? ఖచ్చితంగా! అతని కార్యాలన్నీ మరియు అతని అలవాట్లను దేవునికి గౌరవంగా చేస్తుందా? లేదు.

ధూమపానం పాపం అని ప్రకటించుటలో, ధూమపానం చేసేవారందరు రక్షించబడలేదు అని మనం చెప్పుటలేదు. యేసు యందు నిజంగా నమ్మిక యుంచిన వారు ధూమపానం చేసే వారు చాలమంది ఉన్నారు. ఒక వ్యక్తి రక్షింపబడుటకు ధూమపానం నిరోధకంగా ఉండదు. లేదా ఒక వ్యక్తి రక్షణను కోల్పోవుటకు అది కారణంగా ఉండదు. ధూమపానం అనేది ఏ ఇతర పాపం కంటే తక్కువ క్షమించరానిదికాదు, అది క్రైస్తవునిగా మారే వ్యక్తికైన లేదా ఒక క్రైస్తవుడు ఆమె/అతని పాపమును దేవుని యెదుట ఒప్పుకొనువారైన (1 యోహాను 1:9). అదే సమయంలో, ధూమపానం అనేది దేవుని సహాయం ద్వార విడువవలసిన పాపం అని మేము ఖచ్చితంగా నమ్ముతాము.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

పొగ త్రాగుటను గూర్చి క్రైస్తవ అభిప్రాయం ఏమిటి? సిగరెట్ త్రాగడం పాపమా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.