బైబిల్ లో తప్పిదములు, వైరుధ్యాలు, లేక వ్యత్యాసాలు ఉన్నాయా?

ప్రశ్న బైబిల్ లో తప్పిదములు, వైరుధ్యాలు, లేక వ్యత్యాసాలు ఉన్నాయా? జవాబు తప్పిదములు కనుగొనాలనే ఆలోచనతో కాకుండా, బైబిల్ ను మనం ఉన్నది ఉన్నట్లుగా చదివితే, అది స్థిరమైనదని, హేతుబద్ధమైనదని మరియు అర్థం చేసుకొనుటకు సులభమైనదని మనం కనుగొంటాము. అవును, కొన్ని కష్టమైన వాక్య భాగములు ఉన్నాయి. అవును, ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి అనిపించు వచనములు కూడా ఉన్నాయి. బైబిల్ ను సుమారుగా 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు వ్రాసారు అను మాటను…

ప్రశ్న

బైబిల్ లో తప్పిదములు, వైరుధ్యాలు, లేక వ్యత్యాసాలు ఉన్నాయా?

జవాబు

తప్పిదములు కనుగొనాలనే ఆలోచనతో కాకుండా, బైబిల్ ను మనం ఉన్నది ఉన్నట్లుగా చదివితే, అది స్థిరమైనదని, హేతుబద్ధమైనదని మరియు అర్థం చేసుకొనుటకు సులభమైనదని మనం కనుగొంటాము. అవును, కొన్ని కష్టమైన వాక్య భాగములు ఉన్నాయి. అవును, ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి అనిపించు వచనములు కూడా ఉన్నాయి. బైబిల్ ను సుమారుగా 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు వ్రాసారు అను మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి రచయిత ఒక విశేష ఆలోచనలో, విశేష శైలిలో, విశేష శ్రోతలకు, విశేష ఉద్దేశముతో వ్రాసాడు. కొన్ని చిన్న చిన్న తేడాలను మనం ఊహించవచ్చు. అయితే, తేడా వ్యతిరేకత కాదు. వచనములు లేక వాక్య భాగములు వివరించు ఎలాంటి మార్గము లేకపోతేనే అది తప్పిదమవుతుంది. ఇప్పుడు జవాబు దొరకక పోయినా, దాని అర్థం జవాబు లేదని కాదు. చరిత్ర మరియు భౌగోళిక శస్త్ర ఆధారంగా అనేకులు బైబిల్ లో తప్పిదమును వెదకుటకు ప్రయత్నించారు గాని, తదుపరి పురావస్తు రుజువులు కనుగొనబడిన తరువాత బైబిల్ నిజమని తెలుసుకున్నారు.

“ఈ వచనములు ఎలా వ్యతిరేకంగా లేవో వివరించండి!” లేక “చూడండి, ఇక్కడ బైబిల్ లో తప్పిదము ఉంది!” వంటి కొన్ని ప్రశ్నలను తరచుగా మనం ఎదుర్కొంటాము. వాస్తవానికి, ప్రజలు తెచ్చు కొన్ని ప్రశ్నలకు జావాబు ఇవ్వడం కష్టం. బైబిల్ లో వ్యతిరేకత లేక తప్పిదము అనిపించు ప్రతి దానికి తర్కపూర్వకముగా స్పష్టమైన మరియు నాణ్యమైన జవాబు ఉన్నదని మా అభిప్రాయం. “బైబిల్ లోని అన్ని తప్పిదములు” అని ఎత్తి చూపు పుస్తకాలు మరియు వెబ్సైటులు ఉన్నాయి. చాలా మంది వారి ఆయుధములు ఇక్కడ నుండి పొందుతారు; తప్పిదములు వారు వారంతట వారు కనుగొనరు. బైబిల్ పై దాడి చేసేవారు నిజముగా జవాబుపై ఆసక్తి చూపరు అనునది విషాదకరమైన విషయం. “బైబిల్ పై దాడి చేయువారిలో” అనేకమందికి ఈ జవాబులు తెలుసుగాని, వారు అదే పాత దాడిని మరలా మరలా చేస్తుంటారు.

కాబట్టి, బైబిల్ తప్పిదమును చూపుతూ ఎవరైనా మన దగ్గరకు వస్తే మనం ఏమి చెయ్యాలి? 1) ప్రార్థనాపూర్వకముగా లేఖనములు చదివి సులువైన జవాబు ఉన్నదేమో చూడాలి. 2) కొన్ని బైబిల్ వ్యాఖ్యానములు, “బైబిల్ ను సమర్థించు” పుస్తకాలు, మరియు బైబిల్ పరిశోధన వెబ్సైటులు ఉపయోగించి కొంత పరిశోధన చెయ్యాలి. 3) పరిష్కారం కొరకు సంఘ కాపరిని/నాయకుని అడగాలి. 4) 1), 2), మరియు 3) మెట్లను అనుసరించిన తరువాత కూడా స్పష్టమైన జవాబు దొరకకపోతే, ఆయన వాక్యము సత్యమని మరియు ఇప్పటి వరకు కనుగొనని ఒక పరిష్కారం ఉన్నదని మనం దేవుని నమ్ముతాము (2 తిమోతి 2:15, 3:16-17).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

బైబిల్ లో తప్పిదములు, వైరుధ్యాలు, లేక వ్యత్యాసాలు ఉన్నాయా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.