మనకు రెండు భాగములు ఉన్నాయా లేక మూడు భాగములు ఉన్నాయా?

ప్రశ్న మనకు రెండు భాగములు ఉన్నాయా లేక మూడు భాగములు ఉన్నాయా? జవాబు ఆదికాండము 1:26-27 వచనములు ప్రకారము మానవాళిని ఈ సృష్టింపబడిన మిగతా సృష్టినుండి వేరు చేస్తున్నది ఏదో ఒక ప్రత్యేకమైనది ఉన్నదని సూచిస్తుంది. దేవునితో సహవాసము కలిగియుండుటకు మానవులు సృష్టింపబడ్డారు, కాగా, దేవుడు మనలను ఐహికమైన మరియు అనైహికమైన పదార్ధములతో/భాగాములతో సృష్టించాడు. ఐహికమైనది ఏమనగా మనము స్పృశించునది: భౌతికమైన శరీరము, ఎముకలు, అవయవములు మొదలగునవి., మరియు ఇవి వ్యక్తి జీవించియున్నంత కాలము ఉంటాయి. అనైహికమైనవి…

ప్రశ్న

మనకు రెండు భాగములు ఉన్నాయా లేక మూడు భాగములు ఉన్నాయా?

జవాబు

ఆదికాండము 1:26-27 వచనములు ప్రకారము మానవాళిని ఈ సృష్టింపబడిన మిగతా సృష్టినుండి వేరు చేస్తున్నది ఏదో ఒక ప్రత్యేకమైనది ఉన్నదని సూచిస్తుంది. దేవునితో సహవాసము కలిగియుండుటకు మానవులు సృష్టింపబడ్డారు, కాగా, దేవుడు మనలను ఐహికమైన మరియు అనైహికమైన పదార్ధములతో/భాగాములతో సృష్టించాడు. ఐహికమైనది ఏమనగా మనము స్పృశించునది: భౌతికమైన శరీరము, ఎముకలు, అవయవములు మొదలగునవి., మరియు ఇవి వ్యక్తి జీవించియున్నంత కాలము ఉంటాయి. అనైహికమైనవి ఏవనగా మనము స్పృశించలేనివి: ప్రాణము, ఆత్మ, బుద్ధి, చిత్తము, మనసాక్షి మొదలగునవి. ఇవన్నియు వ్యక్తియొక్క భౌతిక కాల గమనము తరువాత కూడా మనుగడలోనే ఉంటాయి.

మనుష్యులందరూ ఈ ఐహికమైన మరియు అనైహికమైన లక్షణములను కలిగియుంటారు. మానవులందరికీ మాంసము, రక్తము, ఎముకలు, అవయవములు, మరియుకణములు కలిగిన ఒక శరీరము ఉందని స్పష్టముగా తెలుస్తుంది. కాని, మానవులలో ఉన్న అస్పృశ్యమైనవే తరచూ వాదించబడుతూ ఉంటాయి. వీటిని గూర్చి లేఖనములు ఏమి చెప్తున్నాయి? మానవుడుజీవాత్మగా సృష్టింపబడినట్లు ఆదికాండము 2:7 తెలియజేస్తుంది. సంఖ్యాకాండము 16:22వ వచనము దేవుని “సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా” అనిప్రస్తావిస్తూ ఈ ఆత్మ శరీరులందరిలో ఉన్నదని తెలుపుతుంది. సామెతలు 4:23వ వచనము “నీహృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అనిచెప్తూ, మానవుని చిత్తము మరియు భావోద్వేగములకు హృదయమే కేంద్రముగా ఉన్నదని సూచిస్తుంది. అపొస్తలుల కార్యములు 23:1 ప్రకారం, “పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనసాక్షిగలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను” అని చదువుతాము. ఇక్కడ పౌలు మనసాక్షిని గూర్చి, అంటే తప్పుఒప్పులను బట్టి మనలను ఒప్పించే ఆ మస్సులోని భాగమును గూర్చి మాట్లాడుతున్నాడు.“మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి” అని రోమా 12:2 మనకు హెచ్చరిస్తుంది.ఈ వచనములు, ఇంకా ఇతర అనేక వచనములతో కలిసి, మానవాళి యొక్క అనైహికమైన భాగములో అనేక అంశములను గూర్చి మాట్లాడుతున్నాయి. మనము ఐహికమైన మరియు అనైహికమైన లక్షణములను రెండిటిని కూడా పొందుతాము.

కాబట్టి, కేవలముప్రాణము మరియు ఆత్మల కంటే కూడా లేఖనములు ఇంకా ఎక్కువైనా వాటినే ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. కొంతమేర ఈ ప్రాణము, ఆత్మ, హృదయము, మనసాక్షి, మరియు మనస్సు ఇవన్నియు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి అనుసంధానముగా ఉన్నాయి. అయినను, ప్రాణము మరియు ఆత్మ అనునవి ప్రధానముగా మానవులలో ఉన్న అనైహికమైన పదార్ధములు గా ఉన్నాయి. ఇవే మిగతా అంశములను వాటిలో కలిగియుంటాయి. దీనిని మనసులో పెట్టుకొని, ఇప్పుడు మానవజాతి ద్వితీయభాగమా (అంటే శరీరము/ప్రాణము-ఆత్మగా విభజించబడినదా) లేక తృతీయభాగమా (అంటే శరీరము/ప్రాణము/ఆత్మగా విభజింపబడినదా)? ఇక్కడ సిద్ధాంత ఆధారితముగా ఉండుట కష్టము. ఈ రెండు ఆలోచనలకు మద్దతునిచ్చే వాదనలు కూడా ఉన్నాయి. మూల వచనము హెబ్రీయులకు 4:12: “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” ఈ వాదనము గూర్చి ఇక్కడి వచనము కనీసం రెండు విషయాలను మనకు చెప్తుంది. ప్రాణము మరియు ఆత్మ విభజింపబడగలవు, మరియు ఈ ప్రాణము మరియు ఆత్మలకు మధ్యగల విభజనను కేవలము దేవుడు మాత్రమే శోధించగలడు. ఖచ్చితముగా మనకు తెలియనిదాని గూర్చి మనము ద్రుష్టించుట కంటే కూడా,“భయమును మరియు ఆశ్చర్యమును” కలుగునట్లుగా మనలను చేసిన (కీర్తన 139:4) సృష్టికర్తపై దృష్టించుట మిక్కిలి శ్రేష్టము.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

మనకు రెండు భాగములు ఉన్నాయా లేక మూడు భాగములు ఉన్నాయా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *