మరణం తరువాత ఏమి జరుగుతుంది?

ప్రశ్న మరణం తరువాత ఏమి జరుగుతుంది? జవాబు క్రైస్తవ విశ్వాసులలోనే, మరణం తరువాత ఏమి జరుగుతుంది అను విషయమును గూర్చి గొప్ప సందిగ్ధం ఉంది. మరణం తరువాత ఆఖరి తీర్పు వరకు అందరు “నిద్రిస్తారు,” ఆ తరువాత అందరు పరలోకానికి లేక నరకానికి పంపబడతారని కొందరు నమ్ముతారు. మరణించిన వెంటనే ఒకనికి తీర్పుతీర్చబడి పరలోకానికి లేక నరకానికి పంపబడతారు అని మరికొందరు నమ్ముతారు. మరణించిన తరువాత ప్రజల యొక్క ప్రాణములు/ఆత్మలు “తాత్కాలిక” పరలోకం లేక నరకంలోనికి పంపబడి,…

ప్రశ్న

మరణం తరువాత ఏమి జరుగుతుంది?

జవాబు

క్రైస్తవ విశ్వాసులలోనే, మరణం తరువాత ఏమి జరుగుతుంది అను విషయమును గూర్చి గొప్ప సందిగ్ధం ఉంది. మరణం తరువాత ఆఖరి తీర్పు వరకు అందరు “నిద్రిస్తారు,” ఆ తరువాత అందరు పరలోకానికి లేక నరకానికి పంపబడతారని కొందరు నమ్ముతారు. మరణించిన వెంటనే ఒకనికి తీర్పుతీర్చబడి పరలోకానికి లేక నరకానికి పంపబడతారు అని మరికొందరు నమ్ముతారు. మరణించిన తరువాత ప్రజల యొక్క ప్రాణములు/ఆత్మలు “తాత్కాలిక” పరలోకం లేక నరకంలోనికి పంపబడి, ఆఖరి పునరుత్ధానం, ఆఖరి తీర్పు, మరియు వారి యొక్క నిత్య గమ్యము యొక్క తీర్పు కొరకు ఎదురుచూస్తారు. కాబట్టి, మరణం తరువాత ఖచ్చితంగా ఏమి జరుగుతుందని బైబిల్ చెబుతుంది?

మొదటిగా, యేసు క్రీస్తు యొక్క విశ్వాసి కొరకు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా వారి పాపములు క్షమించబడెను కాబట్టి, మరణం తరువాత వారి ఆత్మలు/ప్రాణములు పరలోకానికి తీసుకొనిపోబడతాయని బైబిల్ చెబుతుంది (యోహాను 3:16, 18, 36). విశ్వాసులకు మరణం అనగా “శరీరమును వెడలిపోయి క్రీస్తుతో ఉండెదను” (2 కొరింథీ. 5:6-8; ఫిలిప్పీ. 1:23). అయితే, విశ్వాసులు పునరుత్ధానం పొంది మహిమగల శరీరములు పొందుకుంటారని 1 కొరింథీ. 15:50-54 మరియు 1 థెస్స. 4:13-17 వివరిస్తుంది. మరణం అయిన వెంటనే విశ్వాసులు క్రీస్తుతో ఉండుటకు వెళ్తే, ఈ పునరుత్ధానం యొక్క ఉద్దేశము ఏమిటి? విశ్వాసుల యొక్క ఆత్మలు/ప్రాణములు మరణం అయిన వెంటనే క్రీస్తు యొద్దకు వెళ్తే, భౌతిక శరీరము సమాధిలో “నిద్రిస్తుంది” అనిపిస్తుంది. విశ్వాసుల యొక్క పునరుత్ధానంలో, భౌతిక శరీరం పునరుత్ధానం పొందుతుంది, మహిమ పొందుతుంది, మరియు ఆత్మ/ప్రాణముతో మరలా జతపరచబడుతుంది. ఈ మరలా జతపరచబడిన మరియు మహిమపరచబడిన శరీరం-ప్రాణం-ఆత్మ నూతన ఆకాశం మరియు నూతన భూమిలో నిత్యత్వం వరకు విశ్వాసుల యొక్క స్వాస్థ్యం అవుతుంది (ప్రకటన 21-22).

రెండవదిగా, క్రీస్తును రక్షకునిగా అంగీకరించనివారికి, మరణం అనగా నిత్య శిక్ష అవుతుంది. అయితే, విశ్వాసుల వలెనే, అవిశ్వాసులు కూడా ఆఖరి పునరుత్ధానం, తీర్పు, మరియు నిత్య గమ్యము కొరకు తాత్కాలిక స్థలమునకు పంపబడతారు. ధనవంతుడు మరణించిన వెంటనే హింసించబడెను అని లూకా 16:22-23 వర్ణిస్తుంది. అవిశ్వాసులుగా మరణించిన వారందరు తిరిగి లేచి, గొప్ప శ్వేత సింహాసనం యొద్ద తీర్పును పొంది, తరువాత అగ్ని గుండమునకు పంపబడతారని ప్రకటన 20:11-15 వివరిస్తుంది. అనగా, అవిశ్వాసులు మరణం తరువాత వెంటనే నరకంలోనికి (అగ్ని గుండములోనికి) పంపబడరుగాని, తీర్పు మరియు శిక్ష అను తాత్కాలిక స్థలంలో ఉంటారు. అయితే, అవిశ్వాసులు వెంటనే అగ్ని గుండములోనికి పంపబడనప్పటికీ, మరణం తరువాత వారి గమ్యం అంత సుఖవంత కాదు. ధనవంతుడు, “నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని” కేకలు వేశాడు (లూకా 16:24).

కాబట్టి, మరణం తరువాత, ఒక వ్యక్తి “తాత్కాలిక” పరలోకం లేక నరకంలో ఉంటాడు. ఆ తాత్కాలిక ప్రదేశం తరువాత, ఆఖరి పునరుత్ధానంలో, ఆ వ్యక్తి యొక్క నిత్య గమ్యం మార్చబడదు. ఆ నిత్య గమ్యం యొక్క ఖచ్చితమైన “స్థానం” మారుతుంది అంతే. విశ్వాసులకు తుదకు నూతన ఆకాశం మరియు నూతన భూమిలోనికి ప్రవేశం లభిస్తుంది (ప్రకటన 21:1).అవిశ్వాసులు తుదకు అగ్నిగుండములోనికి పంపబడతారు (ప్రకటన 20:11-15). ఇవి ప్రజలందరి యొక్క ఆఖరి నిత్య గమ్యాలు-వారు తమ రక్షణ కొరకు యేసు క్రీస్తుపై మీద మాత్రమే విశ్వాసం ఉంచారో లేదో అను దాని ఆధారంగా (మత్తయి 25:46; యోహాను 3:36).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

మరణం తరువాత ఏమి జరుగుతుంది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.