మరణ శిక్ష/ఉరిశిక్షను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

ప్రశ్న మరణ శిక్ష/ఉరిశిక్షను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? జవాబు పాత నిబంధన ధర్మశాస్త్రం వివిధ చర్యలకు మరణశిక్షను ఆజ్ఞాపించింది: హత్య (నిర్గమ. 21:12), అపహరణం (నిర్గమ 21:16), మృగసంయోగం చేయువాడు (నిర్గమ 22:19), వ్యభిచారం (లేవీయ 20:10), పురుషసంయోగులు (లేవీయ. 20:13), అబద్ధ ప్రవక్త (ద్వితీ. 13:5), వ్యభిచారం మరియు అత్యాచారం (ద్వితీ. 22:4), మరియు ఇతర అనేక నేరములు. అయితే, మరణశిక్ష పొందవలసియున్నప్పుడు దేవుడు తరచు దయను చూపించాడు. దావీదు వ్యభిచారం చేసి మరియు…

ప్రశ్న

మరణ శిక్ష/ఉరిశిక్షను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు

పాత నిబంధన ధర్మశాస్త్రం వివిధ చర్యలకు మరణశిక్షను ఆజ్ఞాపించింది: హత్య (నిర్గమ. 21:12), అపహరణం (నిర్గమ 21:16), మృగసంయోగం చేయువాడు (నిర్గమ 22:19), వ్యభిచారం (లేవీయ 20:10), పురుషసంయోగులు (లేవీయ. 20:13), అబద్ధ ప్రవక్త (ద్వితీ. 13:5), వ్యభిచారం మరియు అత్యాచారం (ద్వితీ. 22:4), మరియు ఇతర అనేక నేరములు. అయితే, మరణశిక్ష పొందవలసియున్నప్పుడు దేవుడు తరచు దయను చూపించాడు. దావీదు వ్యభిచారం చేసి మరియు హత్య చేశాడు, అయినను దేవుడు తన ప్రాణమును తీయాలని ఆశపడలేదు (2 సమూయేలు 11:1-5, 14-17; 2 సమూ 12:13). చివరికి, మనం చేసే ప్రతి పాపమునకు ఫలితం మరణ దండన ఎందుకంటే పాపము వలన వచ్చు జీతం మరణం (రోమా. 6:23). కృతజ్ఞతగా, దేవుడు మనలను ఖండిస్తూ కాదు మన కొరకు తన ప్రేమ వెల్లడిపరచింది (రోమా 5:8).

వ్యభిచారమందు పట్టబడిన స్తీని పరిసయ్యులు యేసునొద్దకు తీసుకొనివచ్చి మరియు ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలా అని ఆయనను అడిగినప్పుడు, యేసు చెప్పెను, “మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను” (యోహాను 8:7). అన్ని సందర్భాల్లో యేసు మరణశిక్షను తిరస్కరించాడని కాదు దీని అర్థం. యేసు కేవలం పరిసయ్యుల యొక్క వేషదారణను బహిర్గతం చేస్తున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రంను ఉల్లంఘించుటకు పరిసయ్యులు యేసును మోసపూరితంగా ఇరికించాలని చూస్తున్నారు; రాళ్లతో కొట్టబడిన స్త్ర్రీ పట్ల వారికి నిజమైన శ్రద్ధ లేదు (వ్యభిచారమందు పట్టబడిన పురుషుడు ఎక్కడ?) దేవుడే మరణశిక్షను స్థాపించింది: “నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఎందుకనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను” (ఆది. 9:6). కొన్ని సందర్భాల్లో యేసు మరణశిక్షను ఆమోదిస్తాడు, మరణశిక్ష పడవలసియున్నప్పుడు యేసు కూడా కృపను వెల్లడిపరచాడు (యోహాను 8:1-11). సరియైన సమయంలో మరణశిక్షను విధించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారమును పౌలు ఖచ్చితంగా గుర్తించాడు (రోమా. 13:1-7).

మరణశిక్షను క్రైస్తవుడు ఏ విధంగా దృష్టించాలి? మొదట, దేవుడు ఆయన వాక్యంలో మరణశిక్షను స్థాపించాడు అని మన జ్ఞాపకముంచుకోవాలి; అందుచేత, మేము ఒక ఉన్నత ప్రమాణాలను నెలకొల్పగలుగుతాము అని ఆలోచించినప్పుడు అది అహంకారమును మనలో కలుగజేస్తుంది. యీ జీవి పట్లైనా దేవునికి ఒక ఉన్నత ప్రామాణిక ఉంది; ఆయన సరైనవాడు. ఈ ప్రామాణం మనకు మాత్రమే వర్తించదు గానీ ఆయనకు కూడా. అందుచేత, ఆయన అనంతముగా ప్రేమిస్తాడు, మరియు ఆయన దయ కూడా అనంతమైనది. ఆయన ఉగ్రత కూడా అనంతమైనదని మన చూడగలము, మరియు ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైన సంతులనంలో నిర్వహించబడుతుంది.

రెండవదిగా, మరణశిక్ష విధించబడవలసిన సమయంలో దానిని విధించుటకు దేవుడు ప్రభుత్వానికి అధికారం ఇచ్చాడని మనం గుర్తించాలి (ఆది. 9:6; రోమా 13:1-7). అన్ని సందర్భాల్లో దేవుడు మరణశిక్షను తిరస్కరిస్తున్నాడని చెప్పడం బైబిల్ కు వ్యతిరేకం. మరణదండన విధింపబడినప్పుడు క్రైస్తవులు ఎప్పుడూ ఆనందించకూడదు, కానీ అదే సమయంలో, అత్యంత చెడ్డవైన నేరాలు చేసిన వారికి శిక్షను అమలుపరచుటలో ప్రభుత్వానికి ఉన్న అధికారమునకు వ్యతిరేకంగా క్రైస్తవులు పోరాడకూడదు.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

మరణ శిక్ష/ఉరిశిక్షను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.