యుద్ధమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

ప్రశ్న యుద్ధమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? జవాబు “నీవు నరహత్య చేయవద్దు”, అని నిర్గమ. 20:13లో బైబిల్ యేమని చెప్తుందో అనేకమంది ప్రజలు దానిని చదువుటలో తప్పు చేస్తారు మరియు ఈ ఆజ్ఞను యుద్ధానికి అనువర్తించడానికి చూస్తారు. అయితే, హెబ్రీ పదము అక్షరార్థంగా ఏంటంటే “ అసూయతో మరొక వ్యక్తిని ముందుగానే చంపుటకు నిర్ణయించుట; హత్య.” ఇతర రాజ్యాలతో యుద్ధానికి వెళ్లమని దేవుడు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించాడు (1 సమూ. 15:3; యెహోషువా 4:13). అనేక నేరాలకు…

ప్రశ్న

యుద్ధమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు

“నీవు నరహత్య చేయవద్దు”, అని నిర్గమ. 20:13లో బైబిల్ యేమని చెప్తుందో అనేకమంది ప్రజలు దానిని చదువుటలో తప్పు చేస్తారు మరియు ఈ ఆజ్ఞను యుద్ధానికి అనువర్తించడానికి చూస్తారు. అయితే, హెబ్రీ పదము అక్షరార్థంగా ఏంటంటే “ అసూయతో మరొక వ్యక్తిని ముందుగానే చంపుటకు నిర్ణయించుట; హత్య.” ఇతర రాజ్యాలతో యుద్ధానికి వెళ్లమని దేవుడు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించాడు (1 సమూ. 15:3; యెహోషువా 4:13). అనేక నేరాలకు దేవుడు మరణశిక్షను విధించాడు (నిర్గమ. 21:12, 15; 22:19; లేవీయ 20:11). కాబట్టి, అన్ని సందర్భాల్లో హత్యకు దేవుడు వ్యతిరేకి కాడు, కానీ కేవలం హత్య. యుద్ధం అనేది మంచిపని కాదు, కానీ కొన్నిసార్లు అది అవసరం. పాపపు ప్రజలతో నిండిన ప్రపంచంలో (రోమా 3:10-18), యుద్ధం అనివార్యం. కొన్నిసార్లు పాపపు ప్రజలు అమాయకులైనటువంటి ప్రజలకు హాని కలిగించకుండ ఉండాలంటే యుద్ధానికి వెళ్లడమే.

పాత నిబంధన గ్రంథంలో, “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడని” దేవుడు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించెను (సంఖ్యా. 31:1). ద్వితీయోపదేశకాండము 20:16-17 చెప్తుంది, “అయితే నీ దేవుడైన యెహోవ స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రతుకనియ్యకూడదు. నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని . . . నిర్మూలము చేయవలెను.” 1 సమూ. 15:18 కూడా ఈ విధంగా చెప్తుంది, “నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగువరకు వారితో యుద్ధము చేయుమని సెలవిచ్చెను. యేసు ఎల్లప్పుడు కూడా తండ్రితో పరిపూర్ణ సంబంధం కలిగియున్నాడు (యోహా. 10:30), కాబట్టి పాత నిబంధనలో మాత్రమే యుద్ధము దేవుని చిత్తం అని మనం వాదించకూడదు. దేవుడు మార్పులేని వాడు (మలకీ 3:6; యాకోబు 1:17).

యేసు రెండవ రాకడ మిక్కిలి హింసాత్మకంగా ఉంటుంది. ప్రకటన 19:11-21 క్రీస్తుతో అనగా “న్యాయంతో” (వ. 11) యుద్ధం జరిపించి తీర్పు తీర్చి జయించే సేనాధిపతితో చివరి యుద్ధము గూర్చి వివరిస్తుంది. రక్తముతో నిండినదిగా (వ. 13) మరియు మహిమతో ఉంటుంది. ఆయనను వ్యతిరేకించువారి యొక్క మాంసమును పక్షులు తింటాయి (వ. 17-18). తన శత్రువులపై ఆయనకు కనికరం ఉండడు, వారిని ఆయన పూర్తిగా జయించి మరియు “గంధముతో మండు అగ్నిగుండములో” వారిని వేస్తాడు (వ. 20).

దేవుడు యుద్ధముకు మద్దతు పలుకడని చెప్పుట తప్పు. యేసు శాంతివాది కాడు. చెడు ప్రజలతో నిండినటువంటి లోకంలో, మరింత చెడు జరుగకుండ ఉండాలంటే యుద్ధం తప్పనిసరి. ఒకవేళ Hitler రెండవ ప్రపంచ యుద్ధం ద్వార ఓడింపబడకపోతే, ఎంత మంది లక్షల మంది చంపబడేవారో? ఒకవేళ అమెరికా అంతర్యుద్ధం జరగకపోతే, ఆఫ్రికన్-అమెరికన్లు ఎంత కాలం బానిసలుగా బాధపడేవారో?

యుద్ధం భయంకరమైన విషయం. కొన్ని యుద్ధాలు ఇతర వాటి కంటే “న్యాయమైనవి”, కానీ యుద్ధం ఎల్లప్పుడు కూడా పాప ఫలితమే (రోమా 3:10-18). అదే సమయంలో, ప్రసంగి 3:8లో ఈ విధంగా చెప్తుంది, “ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. . . సమయము కలదు.” పాపంతో, ద్వేషంతో, మరియు చెడుతో నిండిపోయిన ప్రపంచంలో (రోమా 3:10-18), యుద్ధం అనేది సహజం. క్రైస్తవులు యుద్దమును కోరుకోకూడదు, కానీ దేవుడు ప్రజలపై అధికారులుగా నియమించిన ప్రభుత్వమును క్రైస్తవులు వ్యతిరేకించకూడదు (రోమా 13:1-4; 1 పేతురు 2:17).యుద్ధ సమయంలో మనం చేయగలిగిన ప్రాముఖ్యమైన పనిఏంటంటే మన నాయకులకు దైవ జ్ఞానం కొరకు ప్రార్థించాలి, మన సైన్య రక్షణ కొరకు ప్రార్థించాలి, వైరుధ్యాల సత్వర స్పష్టత కొరకు ప్రార్థించాలి, మరియు రెండు వైపులా పౌరుల మధ్య తక్కువ ప్రాణనష్టము కొరకు ప్రార్థించాలి (ఫిలిప్పీ. 4:6-7).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

యుద్ధమును గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.