వివాహమునకు ముందు లైంగిక సంబంధమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

ప్రశ్న వివాహమునకు ముందు లైంగిక సంబంధమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? జవాబు వివాహమునకు ముందు లైంగిక సంబంధమును గూర్చి సంబోధించు హెబ్రీ లేక గ్రీకు పదము బైబిల్ లో ఉపయోగించబడలేదు. బైబిల్ నిశ్చయంగా వ్యభిచారమును మరియు లైంగిక అక్రమ సంబంధాలను ఖండిస్తుంది, కాని వివాహం ముందు లైంగిక సంబంధం అక్రమముగా పరిగణించబడుతుందా? 1 కొరింథీ. 7:2 ప్రకారం, “అవును” అనునది స్పష్టమైన జవాబు. “అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త…

ప్రశ్న

వివాహమునకు ముందు లైంగిక సంబంధమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు

వివాహమునకు ముందు లైంగిక సంబంధమును గూర్చి సంబోధించు హెబ్రీ లేక గ్రీకు పదము బైబిల్ లో ఉపయోగించబడలేదు. బైబిల్ నిశ్చయంగా వ్యభిచారమును మరియు లైంగిక అక్రమ సంబంధాలను ఖండిస్తుంది, కాని వివాహం ముందు లైంగిక సంబంధం అక్రమముగా పరిగణించబడుతుందా? 1 కొరింథీ. 7:2 ప్రకారం, “అవును” అనునది స్పష్టమైన జవాబు. “అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.” ఈ వచనంలో, లైంగిక అక్రమానికి వివాహం ఒక “వైద్యం” అని పౌలు చెబుతున్నాడు. 1 కొరింథీ. 7:2 ముఖ్యంగా ఏమని చెబుతుందంటే, ప్రజలు తమను తాము స్వాధీనపరుచుకోలేరు కాబట్టి చాలా మంది వివాహం వెలుపల అక్రమ సంబంధాలు కలిగియున్నారు, కాబట్టి ప్రజలు వివాహం చేసుకోవాలి. తరువాత వారు తమ ఆశలను క్రమమైన మార్గములలో తీర్చుకోవచ్చు.

1 కొరింథీ. 7:2 లైంగిక అక్రమ సంబంధము యొక్క నిర్వచనములో వివాహం ముందు లైంగిక సంబంధమును కూడా జోడిస్తుంది కాబట్టి, లైంగిక అక్రమ సంబంధాలను పాపము అని పరిగణించు ప్రతి బైబిల్ వాక్య భాగం వివాహం ముందు లైంగిక సంబంధమును కూడా పాపమని ఖండిస్తుంది. వివాహం ముందు లైంగిక సంబంధం అక్రమ లైంగిక సంబంధం యొక్క బైబిల్ నిర్వచనంలో చేర్చబడింది. వివాహం ముందు లైంగిక సంబంధం పాపమని అనేక లేఖనములు ప్రకటించుచున్నాయి (అపొ. 15:20; 1 కొరింథీ. 5:1; 6:13, 18; 10:8; 2 కొరింథీ. 12:21; గలతీ. 5:19; ఎఫెసీ. 5:3; కొలొస్సీ. 3:5; 1 థెస్స. 4:3; యూదా 7). వివాహమునకు ముందు పూర్తి నిషేధమును బైబిల్ ప్రతిపాదిస్తుంది. భర్త మరియు తన భార్య మధ్య లైంగిక సంబంధమును మాత్రమే దేవుడు ఆమోదిస్తాడు (హెబ్రీ. 13:4).

చాలా సార్లు లైంగిక సంబంధాలలో ఫలించి వృద్ధి చెందమని ఉన్న విషయమును మరచి “ఆహ్లాదము”పైన మాత్రమే మనం దృష్టిపెడతాము. వివాహ అనుబంధంలో లైంగిక సంబంధం ఆహ్లాదకరమైనది, మరియు దేవుడు దానిని ఆ విధంగా సృష్టించాడు. వివాహ బంధములో స్త్రీ పురుషులు లైంగిక కలయికను అనుభవించాలని దేవుడు ఆశించుచున్నాడు. లైంగిక సంబంధంలోని ఆహ్లాదమును పరమగీతము మరియు అనేక ఇతర బైబిల్ వాక్య భాగములు (సామెతలు 5:19 వంటివి) స్పష్టముగా వివరిస్తున్నాయి. అయితే, లైంగిక సంబంధములో దేవుని యొక్క ఉద్దేశము పిల్లలను కనుట అని కూడా దంపతులు గ్రహించాలి. ఆ విధంగా, వివాహమునకు ముందు రతిలో దంపతులు పాల్గొనుట రెండింతలు తప్పు-వారికి తగని ఆహ్లాదమును వారు ఆస్వాదిస్తున్నారు, మరియు ప్రతి బిడ్డ కొరకు దేవుడు యోచించిన కుటంబ నిర్మాణం వెలుపల మానవ జీవితాలను సృష్టించుటకు ప్రయత్నిస్తున్నారు.

అభ్యాసిక విషయాలు తప్పు ఒప్పులను నిర్థారించవుగాని, వివాహమునకు ముందు లైంగిక సంబంధాలను గూర్చి బైబిల్ సందేశమును మనం అనుసరించినయెడల, చాలా తక్కువ లైంగిక వ్యాధులు ఉంటాయి, అబార్షన్ల సంఖ్య తగ్గుతుంది, అనవసర గర్భిణీల సంఖ్య తగ్గుతుంది, వారి జీవితాలలో ఇద్దరు తల్లిదండ్రులు లేకుండా జీవించు పిల్లల సంఖ్య కూడా తగ్గుతుంది. వివాహమునకు ముందు లైంగిక సంబంధాల విషయానికి వస్తే, నివారణ మాత్రమే దేవుని యొక్క ఏకైక ప్రణాళిక. నివారణ జీవితాలను కాపాడుతుంది, పిల్లలను సంరక్షిస్తుంది, లైంగిక సంబంధాలకు సరైన విలువను ఇస్తుంది, మరియు, అన్నిటికంటే ముఖ్యంగా, దేవుని ఘనపరుస్తుంది.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

వివాహమునకు ముందు లైంగిక సంబంధమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.