సాతాను ఎవరు?

ప్రశ్న సాతాను ఎవరు? జవాబు సాతానును గూర్చి ప్రజల యొక్క విశ్వాసాలు చాలా తెలివితక్కువ నుండి నైరూప్య విశ్వాసముల వరకు ఉంటాయి – పాపము చేయమని నీ భుజముపై ఎప్పుడూ కూర్చుండిన కొమ్ములు కలిగిన ఎర్రటి చిన్నవాడు మొదలుకొని, చెడుతనము యొక్క వ్యక్తీకరణగా పరిగణించబడే వరకు ఈ ఆలోచనలు ఉంటుంటాయి. కాని, పరిశుద్ధ గ్రంథము అసలు ఈ సాతాను ఎవరు మరియు మన జీవితములను ఈయన ఎలా ప్రభావితము చేస్తాడు అనే విషయాలపై చాల స్పష్టమైన వివరణే…

ప్రశ్న

సాతాను ఎవరు?

జవాబు

సాతానును గూర్చి ప్రజల యొక్క విశ్వాసాలు చాలా తెలివితక్కువ నుండి నైరూప్య విశ్వాసముల వరకు ఉంటాయి – పాపము చేయమని నీ భుజముపై ఎప్పుడూ కూర్చుండిన కొమ్ములు కలిగిన ఎర్రటి చిన్నవాడు మొదలుకొని, చెడుతనము యొక్క వ్యక్తీకరణగా పరిగణించబడే వరకు ఈ ఆలోచనలు ఉంటుంటాయి. కాని, పరిశుద్ధ గ్రంథము అసలు ఈ సాతాను ఎవరు మరియు మన జీవితములను ఈయన ఎలా ప్రభావితము చేస్తాడు అనే విషయాలపై చాల స్పష్టమైన వివరణే ఇస్తుంది. సుళువుగా చెప్పాలంటే, తన పాపమును బట్టి పరలోకములో తనకున్న స్థాయి నుండి క్రిందికి పడిపోయిన ఒక దూత వంటి వ్యక్తియని మరియు ఇప్పుడైతే దేవునికి పూర్తీ విరుద్ధంగా పనిచేస్తూ దేవుని ఉద్దేశములను ఆటంకపరచుటకు తన సాయశక్తులా పనిచేస్తున్న వాడిగా పరిశుద్ధ గ్రంథము నిర్వచిస్తుంది.

సాతాను అసలు పరిశుద్దమైన దూతగా సృష్టించబడ్డాడు. పడిపోవుటకు మునుపు సాతాను పేరు తేజోనక్షత్రమా (లూసిఫరు) అని యెషయా 14:12 తెలియజేస్తుంది. సాతాను ఒక కేరూబులా, అంటే సృష్టింపబడిన దూతలందరిలో ఉన్నతమైన స్థితిలో ఉండే దూతగా, సృష్టింపబడ్డాడని యెహెజ్కేలు 28:12-14 వచనములు తెలియజేస్తున్నాయి. తన సౌందర్యము మరియు స్థితి వలన గర్విష్టుగా మారి దేవునికి కూడా పైగా ఉన్న సింహాసనము మీద కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు (యెషయా 14:13-14; యెహెజ్కేలు 28:15; 1 తిమోతి 3:6). సాతాను యొక్క గర్వము తన పతనమునకు దారితీసింది. యెషయా 14:12-15లో “నేను” అనే పదములు ఎన్నిసార్లు ఉన్నవో గమనించండి. తన పాపము వలన, పరలోకమునుండి దేవుడు సాతానును నిషేధించాడు.

సాతాను ఈ లోకాధికారిగా, యుగ సంబంధమైన అధిపతిగా, వాయుమండల సంబంధమైన అధిపతిగా అయ్యాడు (యోహాను 12:31; 2 కొరింథీ. 4:4; ఎఫెసీ. 2:2). సాతాను “నేరము మోపువాడు” (ప్రకటన 12:10), శోధకుడు (మత్తయి 4:3; 1 థెస్స. 3:5), మరియు మోసగాడు (ఆది. 3; 2 కొరింథీ. 4:4; ప్రకటన 20:3). తన పేరునకు “అపవాది” లేదా “వ్యతిరేకించువాడు” అని అర్థమే. తనకున్న పేరులలో మరొక పేరు దయ్యము, అనగా “దూషకుడు.”

పరలోకము నుండి సాతాను క్రిందికి పడద్రోయబడినప్పటికీ, దేవునికంటే ఎత్తుగా తన సింహాసనమును ఉంచుకోవాలని చూస్తుంటాడు. దేవుడు చేసే ప్రతిదానిని అనుకరిస్తూ, ఈ లోకము యొక్క ఆరాధనను పొందాలని నిరీక్షిస్తూ దేవుని రాజ్యమునకు వ్యతిరేకతను పురికొల్పుతూ ఉంటాడు. ప్రతివిధమైన అబద్ధ మతారాధన వ్యవస్థకు మరియు ప్రపంచ మతముకు వెనుక ఈ సాతాను అంత్య మూలముగా ఉంటాడు. దేవునిని మరియు ఆయనను అనుసరించువారిని వ్యతిరేకించుటకు గాను తన శక్తిసామర్థ్యములలో ఏదైనా ప్రతిదానిని చేస్తాడు. కాని, సాతాను యొక్క భవితవ్యం ఇప్పటికే నిర్ణయించబడి ఉంది – అగ్ని గుండములో నిత్యత్వము గడపడం (ప్రకటన 20:10).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

సాతాను ఎవరు?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.