స్వలింగ సంయోగమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? స్వలింగ సంయోగం పాపమా?

ప్రశ్న స్వలింగ సంయోగమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? స్వలింగ సంయోగం పాపమా? జవాబు స్వలింగ సంయోగం పాపం అని బైబిల్ తరచుగా మనకు చెబుతుంది (ఆది. 19:1-13; లేవీ. 18:22; రోమా. 1:26-27; 1 కొరింథీ. 6:9). స్వలింగ సంయోగం దేవుని తిరస్కరించుటకు మరియు ఆయన మాట వినకపోవుటకు పరిణామం అని రోమా. 1:26-27 బోధిస్తుంది. ప్రజలు పాపము మరియు అవిశ్వాసంలో కొనసాగినప్పుడు, దేవునికి వేరుగా ఉండు జీవితం యొక్క వ్యర్థత మరియు నిరాశను చూపించుటకు,…

ప్రశ్న

స్వలింగ సంయోగమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? స్వలింగ సంయోగం పాపమా?

జవాబు

స్వలింగ సంయోగం పాపం అని బైబిల్ తరచుగా మనకు చెబుతుంది (ఆది. 19:1-13; లేవీ. 18:22; రోమా. 1:26-27; 1 కొరింథీ. 6:9). స్వలింగ సంయోగం దేవుని తిరస్కరించుటకు మరియు ఆయన మాట వినకపోవుటకు పరిణామం అని రోమా. 1:26-27 బోధిస్తుంది. ప్రజలు పాపము మరియు అవిశ్వాసంలో కొనసాగినప్పుడు, దేవునికి వేరుగా ఉండు జీవితం యొక్క వ్యర్థత మరియు నిరాశను చూపించుటకు, దేవుడు మరింత దుష్టమైన మరియు తుచ్ఛమైన అభిలాషలకు “వారిని అప్పగించాడు.” స్వలింగ సంయోగంలో పాల్గొను “దోషులు” పరలోక రాజ్యం చేరలేరని 1 కొరింథీ. 6:9 ప్రకటిస్తుంది.

దేవుడు ఒక వ్యక్తిని స్వలింగ సంయోగ వాంఛతో సృష్టించడు. ప్రజలు తమ పాపము వలన (రోమా. 1:24-27) మరియు తుదకు తమ సొంత నిర్ణయాల వలన స్వలింగ సంయోగులు అవుతారని బైబిల్ చెబుతుంది. కొంత మంది ఎక్కువ హింస మరియు ఇతర పాపముల పట్ల బలహీనులై జన్మించునట్లు, ఒక వ్యక్తి స్వలింగ సంయోగం పట్ల గొప్ప బలహీనతతో జన్మించవచ్చు. కాని ఆ వ్యక్తి పాపపు ఆశల వలన పాపము చేయుటను అది సమర్థించదు. ఒక వ్యక్తి కోపం/క్రోధం పట్ల గొప్ప బలహీనతతో జన్మించినయెడల, ఆ వ్యక్తి ఆ ఆశలకు తలొగ్గినయెడల అది సరైన విషయమేనా? ఖచ్చితంగా కాదు! స్వలింగ సంయోగం కూడా అంతే.

ఏదిఏమైనా, స్వలింగ సంయోగము ఇతర పాపముల కంటే “గొప్ప” పాపమని బైబిల్ వివరించదు. ప్రతి పాపము దేవునికి నచ్చనిదే. స్వలింగ సంయోగం కూడా 1 కొరింథీ. 6:9-10లో వర్ణించబడిన ఒక వ్యక్తిని దేవుని రాజ్యము నుండి దూరం చేయు పాపములలో ఒకటి. బైబిల్ ప్రకారం, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, దొంగలకు మరియు ఇతరులకు ఏ విధంగా దేవుని క్షమాపణ దొరుకుతుందో, అలాగే స్వలింగ సంయోగులకు కూడా దొరుకుతుంది. రక్షణ కొరకు యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివారికి పాపము మీద, స్వలింగ సంయోగం మీద కూడా, జయమును పొందుటకు దేవుడు శక్తిని ఇస్తాడు (1 కొరింథీ. 6:11; 2 కొరింథీ. 5:17; ఫిలిప్పీ. 4:13).

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

స్వలింగ సంయోగమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? స్వలింగ సంయోగం పాపమా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.