ఒక క్రైస్తవునికి దయ్యము పట్టే అవకాశం ఉందా?

ప్రశ్న ఒక క్రైస్తవునికి దయ్యము పట్టే అవకాశం ఉందా? జవాబు ఒక క్రైస్తవునికి దయ్యం పడుతుందో లేదో అని బైబిల్ స్పష్టముగా చెప్పకపోయినప్పటికీ, క్రైస్తవులు దయ్యములచే పీడింపబడలేరని సంబంధిత లేఖన సత్యములు పుష్కలంగా తెలియజేస్తున్నాయి. దయ్యము పట్టుట మరియు దయ్యములచే హింసించబడుట లేక ప్రభావితమగుట మధ్య తేడా ఉంది. దయ్యము పట్టుట అనగా ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు/లేక క్రియల మీద దయ్యము సూటిగా/సంపూర్ణంగా అధికారం కలిగియుండుట. (మత్తయి 17:14-18; లూకా 4:33-35; 8:27-33). దయ్యము…

ప్రశ్న

ఒక క్రైస్తవునికి దయ్యము పట్టే అవకాశం ఉందా?

జవాబు

ఒక క్రైస్తవునికి దయ్యం పడుతుందో లేదో అని బైబిల్ స్పష్టముగా చెప్పకపోయినప్పటికీ, క్రైస్తవులు దయ్యములచే పీడింపబడలేరని సంబంధిత లేఖన సత్యములు పుష్కలంగా తెలియజేస్తున్నాయి. దయ్యము పట్టుట మరియు దయ్యములచే హింసించబడుట లేక ప్రభావితమగుట మధ్య తేడా ఉంది. దయ్యము పట్టుట అనగా ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు/లేక క్రియల మీద దయ్యము సూటిగా/సంపూర్ణంగా అధికారం కలిగియుండుట. (మత్తయి 17:14-18; లూకా 4:33-35; 8:27-33). దయ్యము శోధించుట లేక ప్రభావం చూపుట అనగా దయ్యము లేక దయ్యములు ఒక వ్యక్తిని ఆత్మీయంగా దాడిచేసి మరియు/లేక అతనిని/ఆమెను పాపపు స్వభావములోనికి నడిపిస్తాయి. ఆత్మీయ యుద్ధమును గూర్చి మాట్లాడు క్రొత్త నిబంధన లేఖనములన్ని పరిశీలిస్తే, ఒక విశ్వసిలో నుండి దయ్యమును వెళ్లగొట్టుటకు సూచనలు ఇవ్వబడలేదు (ఎఫెసీ. 6:10-18). అపవాదిని ఎదురించమని విశ్వాసులకు చెప్పబడినదిగాని (యాకోబు 4:7; 1 పేతురు 5:8-9), వానిని వెళ్లగొట్టమని కాదు.

క్రైస్తవులలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు (రోమా. 8:9-11; 1 కొరింథీ. 3:16; 6:19). తాను నివాసముంటున్న వ్యక్తిలో అపవాది ప్రవేశించుటకు నిశ్చయముగా పరిశుద్ధాత్మ అవకాశం ఇవ్వడు. తాను క్రీస్తు రక్తము ద్వారా కొని (1 పేతురు 1:18-19)నూతన సృష్టిగా చేసిన (2 కొరింథీ. 5:17) వ్యక్తి దయ్యము పట్టి దాని ద్వారా శాసించబడుటకు దేవుడు అవకాశం ఇచ్చుట అనేది ఊహించలేని విషయం. అవును, విశ్వాసులుగా, సాతానుతోను మరియు దయ్యముల సమూహముతోను మనం యుద్ధము చేస్తాము, కాని అది మన సొంత శక్తితో కాదు. అపొస్తలుడైన యోహాను చెబుతున్నాడు, “చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు” (1 యోహాను 4:4). మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. లోకంలో ఎవరున్నారు? సాతాను మరియు వాని దయ్యముల సమూహం. కాబట్టి, విశ్వాసి దయ్యముల లోకమును ఎదురించెను కాబట్టి, విశ్వాసికి దయ్యము పట్టుట అనునది లేఖనాధారమైన విషయం కాదు.

క్రైస్తవునికి దయ్యము పట్టదు అను బలమైన బైబిల్ రుజువు ఆధారంగా, క్రైస్తవునిపై దయ్యము యొక్క ప్రభావమును వర్ణించుటకు కొంత మంది బైబిల్ బోధకులు “అపవాదిచే పిడింపబడు” (demonization) అను పదమును ఉపయోగిస్తారు. ఒక క్రైస్తవునికి దయ్యము పట్టనప్పటికీ, వాడు దయ్యముచే పీడింపబడగలడని కొందరు వాదిస్తారు. వాస్తవానికి, దయ్యముచే పీడింపబడుట అను దానికి వివరణ దయ్యము పట్టుటకు ఇచ్చు వివరణను పోలియుంది. కాబట్టి, అదే సమస్య ఎదురవుతుంది. పదజాలమును మార్చుట, దయ్యము క్రైస్తవుని పట్టుకొనలేదు లేక సంపూర్ణంగా నియంత్రించలేదు అనే సత్యమును మాత్రం మార్చలేదు. దయ్యముల ప్రభావం మరియు శోధన క్రైస్తవుల జీవితాలలో వాస్తవాలేగాని, ఒక క్రైస్తవునికి దయ్యము పట్టుట లేక దయ్యముచే పీడింపబడుట అనునది బైబిల్ వాక్యమునకు అనుగుణమైనది కాదు.

ఒక “నిజమైన” క్రైస్తవుడు దయ్యము ద్వారా శాసించబడుటను చూచిన వ్యక్తిగత అనుభవం అపవాదిచే పీడింపబడుట అను ఆలోచన వెనుక కారణం కావచ్చు. అయితే, మన వ్యక్తిగత అనుభవం యొక్క ప్రభావము మన లేఖన అనువాదంపై పడునట్లు అవకాశం ఇవ్వకపోవుట చాలా ప్రాముఖ్యమైన విషయం. మన వ్యక్తిగత అనుభవాలను లేఖన సత్యములతో మనం వడపొయ్యాలి (2 తిమోతి 3:16-17). మనం క్రైస్తవుడని ఎంచిన ఒకనికి దయ్యము పట్టుట చూచినప్పుడు, అతడు/ఆమె యొక్క విశ్వాసంలోని నిజాయితీని మనం అనుమానిస్తాము. ఒక క్రైస్తవునికి దయ్యము పడుతుందా/పీడింపబడతాడా అను విషయముపై మన ఆలోచనను మార్చుకొనుటకు ఇది కారణం అవ్వకూడదు. వాస్తవానికి ఆ వ్యక్తి నిజముగానే క్రైస్తవుడుగాని అతడు దయ్యముచే బలముగా శోధించబడుతున్నాడు మరియు/లేక మానసిక సమస్యలను ఎదుర్కొనుచున్నాడు. అయితే, మన అనుభవాలు లేఖన పరీక్షను ఎదుర్కోవాలిగాని, వేరే విధంగా కాదు.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

ఒక క్రైస్తవునికి దయ్యము పట్టే అవకాశం ఉందా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.