దేవదూతలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

ప్రశ్న దేవదూతలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? జవాబు దేవదూతలు జ్ఞానం, భావోద్వేగాలు, మరియు చిత్తము కలిగియున్న వ్యక్తిగత ఆత్మీయ జీవులు. మంచి మరియు చెడ్డ దూతలు (దయ్యములు) ఇలానే ఉంటాయి. దేవదూతలు జ్ఞానము కలిగినవి (మత్తయి 8:29; 2 కొరింథీ. 11:3; 1 పేతురు 1:12), భావోద్వేగము చూపునవి (లూకా 2:13; యాకోబు 2:19; ప్రకటన 12:17), మరియు చిత్తమును ఉపయోగించునవి (లూకా 8:28-31; 2 తిమోతి 2:26; యూదా 6). దేవదూతలు నిజమైన శారీరములు…

ప్రశ్న

దేవదూతలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు

దేవదూతలు జ్ఞానం, భావోద్వేగాలు, మరియు చిత్తము కలిగియున్న వ్యక్తిగత ఆత్మీయ జీవులు. మంచి మరియు చెడ్డ దూతలు (దయ్యములు) ఇలానే ఉంటాయి. దేవదూతలు జ్ఞానము కలిగినవి (మత్తయి 8:29; 2 కొరింథీ. 11:3; 1 పేతురు 1:12), భావోద్వేగము చూపునవి (లూకా 2:13; యాకోబు 2:19; ప్రకటన 12:17), మరియు చిత్తమును ఉపయోగించునవి (లూకా 8:28-31; 2 తిమోతి 2:26; యూదా 6). దేవదూతలు నిజమైన శారీరములు లేని ఆత్మీయ జీవులు (హెబ్రీ. 1:14). వాటికి శరీరములు లేనప్పటికీ, అవి కూడా వ్యక్తిత్వాలే.

అవి సృష్టించబడిన జీవులు కాబట్టి, వాటి జ్ఞానం పరిమితమైనది. అనగా దేవునికి తెలిసినట్లు అన్ని విషయములు వాటికి తెలియవు (మత్తయి 24:36). అయితే, వాటికి మానవుల కంటే ఎక్కువ జ్ఞానం ఉండవచ్చు, మరియు అది మూడు కారణముల వలన కావచ్చు. మొదటిగా, దేవదూతలు మానవుల కంటే గొప్ప జీవులుగా సృష్టించబడినాయి. కాబట్టి, అవి ఎక్కువ జ్ఞానము కలిగియున్నాయి. రెండవదిగా, మానవుల కంటే ఎక్కువ సంపూర్ణంగా దేవదూతలు బైబిల్ ను మరియు లోకమును చదవగలవు మరియు దాని నుండి జ్ఞానమును సంపాదించగలవు (యాకోబు 2:19; ప్రకటన 12:12). మూడవదిగా, మానవ క్రియలను సుదీర్ఘముగా పరిశీలించుట ద్వారా దేవదూతలు జ్ఞానమును పొందగలవు. మానవుల వలె దేవదూతలకు భూతకాలమును చదవవలసిన పని లేదు; అవి దానిని అనుభవించాయి. కాబట్టి, ఇతరులు పలు పరిస్థితులలో ఎలా స్పందించారు మరియు వారి ప్రతి క్రియలు ఎలా ఉన్నాయో వాటికి తెలుసు మరియు మనం అట్టి పరిస్థితులలో ఎలా స్పందిస్తామో అవి ఖచ్చితముగా ప్రవచించగలవు.

దేవదూతలకు ఇతర ప్రాణుల వలె సొంత చిత్తములు ఉన్నప్పటికీ, అవి దేవుని చిత్తమునకు పాత్రులుగా ఉన్నాయి. విశ్వాసులకు సహాయం చేయుటకు మంచి దూతలు దేవునిచే పంపబడినవి (హెబ్రీ. 1:14). బైబిల్ లో సూచించబడిన దేవదూతలు చేయు పనులు:

అవి దేవుని స్తుతిస్తాయి (కీర్తనలు 148:1-2; యెషయా 6:3). అవి దేవుని ఆరాధిస్తాయి (హెబ్రీ. 1:6; ప్రకటన 5:8-13). దేవుడు చేయు పనులలో అవి ఆనందిస్తాయి (యోబు 38:6-7). అవి దేవుని సేవిస్తాయి (కీర్తనలు 103:20; ప్రకటన 22:9). అవి దేవుని ఎదుట ప్రత్యక్షమవుతాయి (యోబు 1:6; 2:1). అవి దేవుని తీర్పుకు సాధనములు (ప్రకటన 7:1; 8:2). అవి ప్రార్థనలకు జవాబులు ఇస్తాయి (అపొ. 12:5-10). క్రీస్తు కొరకు ప్రజలను గెలచుటలో అవి సహాయపడతాయి (అపొ. 8:26; 10:3). అవి క్రైస్తవ పద్ధతి, పని, మరియు శోధనలను గమనిస్తాయి (1 కొరింథీ. 4:9; 11:10; ఎఫెసీ. 3:10; 1 పేతురు 1:12). అపాయకరమైన పరిస్థితులలో అవి ప్రోత్సహిస్తాయి (అపొ. 27:23-24). మరణ సమయంలో నీతిమంతుల శ్రద్ధ వహిస్తాయి (లూకా 16:22).

దేవదూతలు మానవుల కంటే పూర్తిగా భిన్నమైన జీవులు. మానవులు మరణించిన తరువాత దేవదూతలు కారు. దేవదూతలు ఎన్నడు మానవులు కావు, కాలేవు. దేవుడు మానవులను సృష్టించినట్లే దేవదూతలను సృష్టించాడు. మానవుల వలె దేవదూతలు దేవుని యొక్క రూపులోను పోలికలోను సృష్టించబడినాయని బైబిల్ లో ఎక్కడా చెప్పబడలేదు (ఆది. 1:26). దేవదూతలు కొంత వరకు శరీర పోలికను ధరించగల ఆత్మీయ జీవులు. మానవులు ఆత్మీయ కోణము కలిగి ప్రాథమికముగా శారీరక జీవులు. దేవుని ఆజ్ఞలకు త్వరిత, షరతులులేని విధేయత చూపుట పరిశుద్ధ దూతల నుండి మనం నేర్చుకొనదగిన గొప్ప విషయం.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

దేవదూతలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.