దేవుడు ఇశ్రాయేలును ఎందుకు తన ఎన్నుకొనబడిన ప్రజలుగా ఎంపిక చేసికొనెను?

ప్రశ్న దేవుడు ఇశ్రాయేలును ఎందుకు తన ఎన్నుకొనబడిన ప్రజలుగా ఎంపిక చేసికొనెను? జవాబు ఇశ్రాయేలు దేశము గూర్చి మాట్లాడుతూ, ద్వితీయోపదేశకాండము 7:7-9 మనకు చెప్పును, “మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును…

ప్రశ్న

దేవుడు ఇశ్రాయేలును ఎందుకు తన ఎన్నుకొనబడిన ప్రజలుగా ఎంపిక చేసికొనెను?

జవాబు

ఇశ్రాయేలు దేశము గూర్చి మాట్లాడుతూ, ద్వితీయోపదేశకాండము 7:7-9 మనకు చెప్పును, “మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు.”

దేవుడు ఇశ్రాయేలును పాపము నుండి మరియు మరణము నుండి రక్షించువానిగా- ఆ ప్రజల ద్వారా యేసుక్రీస్తు జన్మించేలా ఎన్నుకొనెను (యోహాను 3:16). దేవుడు మొదట ఆదాము మరియు పాపములో పడిపోయిన తర్వాత మెస్సియాకు వాగ్దానం చేసెను (ఆదికాండము 3వ అధ్యాయం). దేవుడు తర్వాత మెస్సియా అబ్రహాము, ఇస్సాకు, మరియు యాకోబు వంశముల నుండి వచ్చునని నిర్దారించెను (ఆదికాండము 12:1-3). దేవుడు ఇస్రాయేలును ఎందుకు తన ప్రత్యేక ప్రజలుగా ఎన్నుకొనుటకు అంతిమ కారణం యేసుక్రీస్తు. దేవునికి ఒక ఎన్నుకొనబడిన ప్రజలు అవసరం లేదు, కాని అతడు ఆ విధముగా చేయుటకు నిర్ణయించుకొనెను.

అయితే, దేవుడు కేవలం మెస్సీయను పంపుటకు మాత్రమే ఇశ్రాయేలును ఎన్నుకొనడం కారణం కాదు. ఇశ్రాయేలు గూర్చి దేవుని కోరిక వారు వెళ్లి ఇతరులకు ఆయన గూర్చి బోధించాలని. ఇశ్రాయేలు మతాధిపతులు, ప్రవక్తలు, మరియు ప్రపంచమునకు మిషనరీల దేశముగా ఉండెను. ఇశ్రాయేలు గూర్చి దేవుని అభిప్రాయం వారు ఒక విభిన్న ప్రజలుగా, ఇతరులను దేవునివైపుకు తిప్పే దేశముగా మరియు ఆయన వాగ్ధాన విమోచకుని, మెస్సీయాను, మరియు రక్షకుని పొందుకొనుట. చాలాభాగము వరకు, ఈ పనిలో ఇశ్రాయేలు విఫలమాయెను. అయితే, ఇశ్రాయేలు గూర్చి దేవుని అంతిమ ఉద్దేశం – మెస్సీయను ఈ లోకములోనికి తీసుకురావాలని- యేసుక్రీస్తు అనే వ్యక్తిగా ఖచ్చితంగా సంపూర్ణమాయెను.

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

దేవుడు ఇశ్రాయేలును ఎందుకు తన ఎన్నుకొనబడిన ప్రజలుగా ఎంపిక చేసికొనెను?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.