యూదులు మరియు అరబ్బులు/ముస్లింలు ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకొనును?

ప్రశ్న యూదులు మరియు అరబ్బులు/ముస్లింలు ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకొనును? జవాబు మొదటిగా, అరబ్బులందరూ ముస్లింలు కాదని అర్ధము చేసికొనుట ప్రాముఖ్యము, మరియు ముస్లింలు అందరు అరబ్బులు కాదు. అరబ్బులలో అత్యధికులు ముస్లింలు అయినప్పటికీ, ఇంకా ముస్లింలు కాని అరబ్బులు ఉండెను. ఇంకా, ఇండోనేషియా మరియు మలేషియా లాంటి ప్రాంతాలలో అరబ్బు ముస్లింల కంటే అరబ్బులు కాని ముస్లింలే గణనీయంగా ఎక్కువ ఉండెను. రెండవది, అరబ్బులందరూ యూదులను ద్వేషించరు, ముస్లింలందరూ యూదులను ద్వేషించరు, మరియు యూదులందరూ అరబ్బులను మరియు…

ప్రశ్న

యూదులు మరియు అరబ్బులు/ముస్లింలు ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకొనును?

జవాబు

మొదటిగా, అరబ్బులందరూ ముస్లింలు కాదని అర్ధము చేసికొనుట ప్రాముఖ్యము, మరియు ముస్లింలు అందరు అరబ్బులు కాదు. అరబ్బులలో అత్యధికులు ముస్లింలు అయినప్పటికీ, ఇంకా ముస్లింలు కాని అరబ్బులు ఉండెను. ఇంకా, ఇండోనేషియా మరియు మలేషియా లాంటి ప్రాంతాలలో అరబ్బు ముస్లింల కంటే అరబ్బులు కాని ముస్లింలే గణనీయంగా ఎక్కువ ఉండెను. రెండవది, అరబ్బులందరూ యూదులను ద్వేషించరు, ముస్లింలందరూ యూదులను ద్వేషించరు, మరియు యూదులందరూ అరబ్బులను మరియు ముస్లింలనుద్వేషించరు అని గుర్తించుకోవడం ప్రాముఖ్యం. ఒకేలాంటి ప్రజలను తప్పించుకోవడానికి మనము జాగ్రత్త పడాలి. అయితే, సాధారణంగా మాట్లాడితే, అరబ్బులకు మరియు ముస్లింలకు యూదుల పట్ల అయిష్టము మరియు అపనమ్మకము, మరియు అదే రీతిగా యూదులకు కూడా.

ఒకవేళ ఈ ద్వేషభావమునకు స్పష్టమైన బైబిలు సంబంధమైన వివరణ వుంటే, అదంతయు ఇంతకు ముందు అబ్రహాము దగ్గరకు వెళ్లును. యూదులు అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు వారసులు. అరబ్బులు అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు వారసులు. ఇష్మాయేలు దాసి కుమారుడు (ఆదికాండము 16:1-16) మరియు ఇస్సాకు అబ్రహాము దీవెనలను స్వాస్థ్యముగా పొందుకొనే వాగ్దాన కుమారుడు (ఆదికాండము 21:1-3), ఖచ్చితంగా ఈ ఇద్దరు కుమారుల మధ్యలో ఏదో ఒక శత్రుత్వం ఉండును. ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించిన ఫలితంగా (ఆదికాండము 21:9), శారా హాగారును మరియు ఇష్మాయేలును పంపివేయుట గూర్చి అబ్రహముతో మాట్లాడెను (ఆదికాండము 21:11-21). బహుశా, ఇది ఇష్మాయేలు హృదయానికి ఇస్సాకు పట్ల ఇంకా ఏహ్యభావం కలుగుటకు కారణమాయెను. ఒక దోఒథ హాగరుతో ప్రవచించి ఇష్మాయేలు, “అతని సహోదరులందరితోను విరోధముగా ఉండును” (ఆదికాండము 16:11-12).

ఇస్లాం మతము, దేనికైతే అత్యధిక అరబ్బులు మద్దతుదారులు, ఈ శత్రుత్వాన్ని మరింత గాఢముగా చేసెను. ఖురాన్ యూదుల గూర్చి కొద్దిగా విరుద్ధ సూచనలను ముస్లింలకు కలిగి వుంది. ఒక దగ్గర అది ముస్లింలను యూదులను సహోదరులుగా భావించాలని మరియు ఇంకొక చోట ఇస్లాంకు మారుటకు తిరస్కరించిన యూదులను దాడిచేయాలని ఆజ్ఞాపించును. అలాగే ఖురాన్ ఒక సంఘర్షణను పరిచయం చేయును అదేటంటే అబ్రాహము యొక్క యే కుమారుడు నిజముగా వాగ్దాన పుత్రుడు. హెబ్రీ లేఖనములు అది ఇస్సాకు అని చెప్పును. ఖురాన్ అది ఇష్మాయేలు అని చెప్పును. ఖురాన్ అబ్రహాము దాదాపుగా బలి ఇచ్చినది ఇస్సాకు కాదు, ఇష్మాయేలు అని బోధించును (ఆదికాండము 22 అధ్యాయానికి విరుద్ధముగా). వాగ్దాన కుమారుడు ఎవరు అనే ఈ చర్చ ఈరోజు శత్రుత్వానికి కారణమాయెను.

అయితే, ఇస్సాకుకు మరియు ఇష్మాయేలు మధ్య ఉన్న చేదుకు పురాతన మూలము ఈరోజు యూదులు మరియు అరబ్బుల మధ్య శత్రుత్వాన్ని వివరించదు. వాస్తవానికి, మధ్య ప్రాచ్యము యొక్క వేయి సంవత్సరాల చరిత్రలో, యూదులు మరియు అరబ్బులు ఒకరిపట్ల ఒకరు సంబంధ శాంతిలో మరియు తేడాలు లేకుండా జీవించెను. ఈ శత్రుత్వానికి ప్రాధమిక కారణం ఒక ఆధునిక మూలము. రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత, యూదు ప్రజలకు United Nations ఇశ్రాయేలు దేశములోని ఒక భాగము ఇచ్చినప్పుడు, ఆ భూమి ప్రాధమికంగా అ సమయానికి అరబ్బులు (పాలస్తీనీయులు) నివాస ప్రదేశము. ఇశ్రాయేలు ఆ భూమిని ఆక్రమించుకొనుటను చాలామంది అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించెను. అరబ్బు దేశాలన్నీ కలిసి ఇశ్రాయేలులు ఆ ప్రదేశమునుoడి తొలగించుటకు ప్రయత్నించి మరియు దాడిచేసెను, కాని వారు ఓడిపోయిరి. అప్పటి నుండి, ఇశ్రాయేలు మరియు దాని పొరుగువారైన అరబ్బుల మధ్య గొప్ప శత్రుత్వం నెలకొనెను. ఇశ్రాయేలు ఒక చిన్న భూభాగాముపై వుండి చాలా పెద్ద అరబ్బు దేశాలైన జోర్డాన్, సిరియా, సౌదీఅరేబియా, ఇరాక్, మరియు ఈజిప్ట్లు చుట్టూ ఉండెను. ఇది మన దృక్కోణం, బైబిలు సంబంధంగా మాట్లాడితే, దేవుడు అబ్రహాము మనుమడైన యాకోబు వారసులకు ఇచ్చిన ఇశ్రాయేలు తన స్వంత భూభాగాముపై ఉనికి కలిగియుండడానికి హక్కు ఉండెను. అదే సమయంలో, ఇశ్రాయేలు శాంతిని పలికి మరియు దాని అరబ్బు పొరుగు వారికి గౌరవం చూపాలని మనము బలముగా నమ్ముదము. కీర్తనలు 122:6 ప్రకటిస్తూ, “యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.”

[English]



[తెలుగు హోం పేజికు వెళ్ళండి]

యూదులు మరియు అరబ్బులు/ముస్లింలు ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకొనును?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.